Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవిని అల్లు అరవింద్ ఇలా దెబ్బతీస్తాడని ఊహించలేదు!

గాడ్ ఫాదర్ చిత్రాన్ని కాంతార భారీగా దెబ్బతీసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. బాక్సాఫీస్ వద్ద పోటీ లేకుండా ఉన్న గాడ్ ఫాదర్ చిత్రం కాంతార విడుదలతో వసూళ్లు కూడా కోల్పోయింది. 
 

kantara damages chiranjeevi godfather collections in a big time
Author
First Published Oct 21, 2022, 10:17 AM IST

తెలుగు రాష్ట్రాల్లో కాంతార చిత్ర జోరు కొనసాగుతోంది. నేడు విడుదలైన కొత్త చిత్రాలకు మించి కాంతార బుకింగ్స్ ఉన్నాయి. అంటే విడుదలైన చిత్రాల కంటే కాంతార చిత్రం మీదే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కెజిఎఫ్ 2, విక్రమ్ చిత్రాల తర్వాత ఆ రేంజ్ లో ఆదరణ దక్కించుకున్న డబ్బింగ్ చిత్రంగా కాంతార నిలిచింది. ఎలాంటి స్టార్ క్యాస్ట్, టెక్నీషియన్స్ లేకున్నా కేవలం వర్డ్ ఆఫ్ మౌత్, కంటెంట్ థియేటర్స్ కి ప్రేక్షకులను రప్పిస్తుంది. 

ఐదు రోజులకు కాంతార మూవీ ఏపీ/తెలంగాణాలలో దాదాపు. 10 కోట్ల షేర్ రాబట్టింది. కాంతార తెలుగు హక్కులు అల్లు అరవింద్ కేవలం రూ. 2 కోట్లకు దక్కించుకున్నారు. అంటే ఇప్పటికే రూ. 8 కోట్ల ప్రాఫిట్ వచ్చి పడింది. మరో వారం బాక్సాఫీస్ వద్ద కాంతార స్ట్రాంగ్ హోల్డ్ కలిగి ఉండే సూచనలు కలవు. 

కాగా కాంతార చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రాన్ని బాగా దెబ్బతీసింది. సెకండ్ వీకెండ్ వసూళ్లు కాంతార కొల్లగొట్టి, గాడ్ ఫాదర్ ని నిరాశపరిచింది. బ్లాక్ బస్టర్ టాక్ నేపథ్యంలో సినిమా లవర్స్ మిగతా చిత్రాలను పట్టించుకోలేదు. కాంతార విడుదల తర్వాత గాడ్ ఫాదర్ వసూళ్లు మరింతగా క్షీణించాయి. కాంతార ప్రభావం భారీగా గాడ్ ఫాదర్ పై పడినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో నష్టాలు పెరిగాయి అంటున్నారు. 

గాడ్ ఫాదర్ చిత్రానికి పోటీగా కాంతార చిత్రాన్ని దించి బావ చిరంజీవికి అల్లు అరవింద్ మంట పెట్టారు అంటున్నారు. గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ రన్ నేటితో దాదాపు ముగిసింది. కాంతార విడుదల లేకపోతే అక్టోబర్ 21 వరకు గాడ్ ఫాదర్ చిత్రానికి పోటీ లేకుండా ఉండేది. మొత్తంగా గాడ్ ఫాదర్ కి కాంతార కోలుకోలేని షాక్ ఇచ్చింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios