Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ నా ఆరాధ్యం అంటోన్న క్రేజీ యంగ్ హీరో, మరీ ఇంత ఇష్టమా...?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఇష్టపడనివారు ఉండరు. సాధారణ జనాలతో పాటు...ఆయనకు పాన్ ఇండియా రేంజ్ లో స్టార్స్ లో కూడా అభిమానులు ఉన్నారు. ఇక రీసెంట్ గా తారక అభిమానుల లిస్ట్ లో మరో యంగ్ స్టార్ కూడా చేరాడు. 

Kannada Young Hero Kireeti Reddy Comments about NTR
Author
First Published Sep 10, 2022, 7:48 AM IST

టాలీవుడ్ లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక  తెలుగు తో పాటు ఇతర భాషల్లోను ఆయనకు చాలా ఇమేజ్ ఉంది. ముఖ్యంగా కర్ణాటకలో తారక్ కు ఎక్కువ శాతం ఫ్యాన్స్ ఉన్నారు. అల్లు అర్జున్ కు కేరళలో డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నట్టే.. కర్ణాటకలో కూడా ఎన్టీఆర్ కు అంత డిమాండ్ ఉంది.  ఆర్ఆర్ఆర్ వల్ల అది కాస్తా రెట్టింపు అయ్యింది. ఇతర బాషలకు కూడా అది పాకేసింది. 

ఎన్టీఆర్ సినిమా వ‌స్తుందంటే క‌నీసం వారం రోజుల ముందు నుంచే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో మాత్ర‌మే కాదు… సినీ అభిమానుల్లో, ట్రేడ్ వ‌ర్గాల్లోనూ ఓ అటెన్ష‌న్ అయితే ఉంటుంది. ఎన్టీఆర్ అభిమానులు అయితే రెండు, మూడు రోజుల ముందు నుంచే హ‌డావిడి స్టార్ట్ చేసేస్తారు. ఎన్టీఆర్ ఎన‌ర్జీ అన్నా, డ్యాన్సులు, డైలాగ్ డెలివ‌రీ.. పాత్ర లో జీవించేందుకు అత‌డు పెట్టే ఎఫ‌ర్ట్ వీటిని మెచ్చ‌ని వారు ఉండ‌రు.

మరీ ముఖ్యంగా కన్నడాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ. అక్కడ అక్కడ సాధారణ జనాలతో పాటు.. అక్కడి స్టార్లు కూడా తారక్ ఫ్యాన్స్. .. ఇత‌ర భాష‌ల్లో హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియ‌న్లు కూడా ఎన్టీఆర్ అంటే  ఎంతో ఇష్ట‌ప‌డుతూ ఉంటారు. క‌న్న‌డ దివంగ‌త స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ – ఎన్టీఆర్ ప్రాణ మిత్రులన్న సంగతి తెలిసిందే..  పునీత్ ప‌వ‌రో సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా గెల‌యా సాంగే కూడా పాడాడు. 

ఇక యంగ్ టైగర్ అంటే స్టార్ హీరోలకు సైతం చాలా ఇష్టం ఇప్పుడు ఆలిస్ట్ లోకి మరో యంగ్ హీరో చేరాడు. తారక్ అంటే ప్రాణం అంటున్నాడు. ఆయన తన ఆరాధ్యం అంటున్నాడు. అతనే బళ్ళారికి చెందిన తెలుగు కుర్రాడు. కన్నడ యంగ్ స్టార్ కిరీటి రెడ్డి. మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి ఏకైక వారసుడు.. కన్నడ నాట నుంచి సినీ పరిశ్రమలో అడుగు పెడుతోన్న యంగ్ హీరో. 

 కిరీటి కి  ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తాను వ్య‌క్తిగ‌తంగా తారక్ ను ఎంతో ఆరాధిస్తాను అని.. బ‌ళ్లారిలో భాష‌తో సంబంధం లేకుండా తాము అన్ని భాష‌ల సినిమాల‌ను ప్రోత్స‌హిస్తామ‌ని చెప్పాడు. ఎన్టీఆర్ సార్ డ్యాన్సులు, న‌ట‌న అన్నా ఎంతో ఇష్టం అంటున్నాడు యంగ్ హీరో.  ఆయ‌న సినిమాల్లో పాట‌లు అద్భుతంగా ఉంటాయ‌ని కిరీటిరెడ్డి  అన్నారు. ఒక రకంగా కిరీటి ఎన్టీఆర్‌ను  ఆకాశానికి ఎత్తేశాడు. దాంతో ఎన్టీఆర్ అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. ఈ దెబ్బతో కిరీటి రెడ్డికి.. అటు  క‌న్న‌డ‌లో, ఇటు తెలుగులోనూ  ఖ‌చ్చితంగా హెల్ఫ్ అవుతార‌నే చెప్పాలి.


 

Follow Us:
Download App:
  • android
  • ios