Asianet News TeluguAsianet News Telugu

`డియర్ కామ్రేడ్‌` వివాదం..తెలుగులో చూడొద్దు

యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా హీరోహీరోయిన్లుగా మ‌రోసారి క‌లిసి న‌టించిన చిత్రం `డియర్ కామ్రేడ్‌`. భ‌ర‌త్ కమ్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రంలో ఇష్ట‌మైన దాని కోసం పోరాటం చేసే యువ‌కుడిగా విజ‌య్ క‌నిపించాడు.

Kannada viewers of 'Dear Comrade' trend controversial
Author
Hyderabad, First Published Jul 26, 2019, 6:04 PM IST

యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా హీరోహీరోయిన్లుగా మ‌రోసారి క‌లిసి న‌టించిన చిత్రం `డియర్ కామ్రేడ్‌`. భ‌ర‌త్ కమ్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రంలో ఇష్ట‌మైన దాని కోసం పోరాటం చేసే యువ‌కుడిగా విజ‌య్ క‌నిపించాడు.

 ఈ సినిమా కు డివైడ్ టాక్ రాగా ఇప్పడు కర్ణాటక నుంచి భారీ  షాక్ వచ్చింది . అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాపై ఫైర్ అవుతున్నారు. దీన్ని కర్ణాటకలో బ్యాన్ చేయవలసిందే అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు . అయితే తమిళ, మళయాళ, తెలుగు భాషల్లో రాని అభ్యంతరాలు ఎందుకు కన్నడ జనం నుంచి వస్తున్నాయంటే.

ప్రధాన కారణం కన్నడంలో దబ్ చేసిన థియేటర్ ల కన్నా తెలుగు వెర్షన్ కె ఎక్కువ థియేటర్లు కేటాయించడం . దీనిని పెద్ద అవమానంగా కన్నడిగులు భావిస్తున్నారు . కన్నడ వెర్షన్ కు గానూ ఐదు థియేటర్ లలో 8 షోలు మాత్రమే బెంగళూరు నగరంలో ప్రదర్శిస్తూ ఉండగా , అదే తెలుగు వెర్షన్ ను 65 థియేటర్లలో 250 షోలు ప్రదర్శిస్తున్నారు .

 కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువ కన్నడ డబ్బింగ్ సినిమాను ప్రదర్శించకుండా తెలుగు ను ప్రదర్శించడంపై కన్నడ సోదరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . దీనిపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. డియర్ కామ్రేడ్ తెలుగు సినిమా ను చూడవద్దని చెబుతున్నారు . తమ మీద బలవంతంగా తెలుగు చిత్రాలను రుద్దితే సహించమని హెచ్చరిస్తున్నారు . ఈ రకమైన చిత్రాలను కర్ణాటక రాష్ట్రంలో అనుమతిస్తున్నందుకు కన్నడ చిత్ర పరిశ్రమ ను కూడా వీరు విమర్శిస్తున్నారు .

Follow Us:
Download App:
  • android
  • ios