Asianet News TeluguAsianet News Telugu

తెలుగులో `సప్త సారాగాలు దాటి`గా వస్తోన్న కన్నడ సెన్సేషన్‌.. రిలీజ్‌ ఎప్పుడంటే?

కన్నడ సూపర్‌ హిట్‌ అయిన మూవీ `సప్త సాగర చెల్లో`. రక్షిత్‌ శెట్టి నటించిన ఈమూవీ లవ్‌ స్టోరీగా తెరకెక్కి విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. తాజాగా ఈ మూవీని తెలుగులో రిలీజ్‌ చేయబోతున్నారు.

kannada super hit movie will release in telugu as saptha sagaralu dhaati arj
Author
First Published Sep 15, 2023, 6:55 PM IST

ఇటీవల ఒక భాషలో హిట్‌ అయిన సినిమాలు వారం పది రోజుల తర్వాత ఇతర భాషల్లో డబ్‌ అవుతూ మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు `కాంతార` అలా వచ్చిందే. `2018` కూడా అలానే వచ్చి హిట్‌ అయ్యింది. ఇప్పుడు మరో కన్నడ మూవీ వస్తోంది. కన్నడలో సూపర్‌ హిట్‌ అయిన `సప్త సాగరదాడే ఎల్లో` మూవీ ఇప్పుడు తెలుగులో వస్తుంది. రక్షిత్‌ శెట్టి, రుక్మిణి వసంత్‌ జంటగా నటించిన ఈ చిత్రం తెలుగులో `సప్త సాగరాలు దాటి` అనే పేరుతో తెలుగులో రిలీజ్‌ కాబోతుంది. రక్షిత్‌ శెట్టి గతంలో `ఛార్లీ 777`, `అతడే శ్రీమన్నారాయణ` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన విషయం తెలిసిందే.

ఈ సినిమాని తెలుగులో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్‌ చేస్తుండటం విశేషం. ఈ నెల 22న ఈ సినిమాని రిలీజ్‌ చేయబోతున్నారు. వచ్చే శుక్రవారం తెలుగులో పెద్ద సినిమాలేవి లేవు. `7జీ బృందావన కాలనీ` రీ రిలీజ్‌ అవుతుండగా, `అష్టదిగ్బందనం` ఇప్పటికైతే ప్రకటించారు. దీంతో మంచి డేట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో కన్నడ హిట్‌ మూవీ `సప్త సాగరాలు దాటి` మూవీని విడుదల చేయబోతున్నారు. 

రక్షిత్‌ శెట్టి హీరోగా నటించిన ఈ మూవీ కన్నడలో సెప్టెంబర్‌1న విడుదలైంది. క్లాసికల్‌ లవ్‌ స్టోరీగా ఆద్యంతం కట్టిపడేస్తుంది. అక్కడ మంచి విజయాన్ని సాధించింది. మౌత్‌ టాక్‌తో పికప్‌ అందుకుంది. సూపర్‌ హిట్‌ దిశగా వెళ్తుంది. యాభై కోట్లకుపైగానే కలెక్షన్లని సాధించింది. దీంతో ఇతర భాషల్లో రిలీజ్‌ చేయాలని చిత్ర బృందం భావించింది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక రెండు భాగాలుగా ఈ సినిమా రానుంది. రెండో భాగాన్ని అక్టోబర్‌ 20న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios