ఇతర బాషల సినిమాలు..ముఖ్యంగా ప్రభాస్ సలార్ మూవీపై అక్కసు వెళ్ళగగ్గారు కన్నడ స్టార్ హీరో దర్శన్. పేరు చెప్పకుండానే.. సినిమాలై తీవ్ర విమర్శలు చేవారు. ఇంతకీ ఆయన ఏమంటున్నారంటే..?
రిలీజ్ కు రెడీ అవుతుంది ప్రభాస్ సలార్ మూవీ. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈసినిమా ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో రిలీజ్ కు సన్నాహాలు జరుగుతన్నాయి. పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ కు అన్ని భాషల్లో క్రేజ్ ఉంది. క్రేజీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆయన అంటే పడిచచ్చిపోతుంటారు. అందుకే ఆయన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ.. భారీ సినిమాలకుప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. అందులో భాగంగా కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో.. కెజిఎఫ్ నిర్మాతలు భారీ బడ్జెట్ తో సలార్ మూవీని నిర్మించారు. మరి ఈ విదషయంలో కొంత మంది కన్నడ హీరోలు కోపంగా ఉన్నారో లేక జలస్ ఫీల్ అవుతున్నారో తెలియదు కాని.. ఇప్పుడిప్పుడే వారి అభిప్రాయాలు బయట పడుతున్నాయి.
సలార్ రిలీజ్ కు 7 రోజులు మాత్రమే ఉంది. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ అవ్వనుంది. సలార్‌ను కేజీఎఫ్ చిత్రాలను నిర్మించి కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తెరకెక్కించింది. దీంతో కన్నడ నాట భార సంఖ్యలో థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఇదే నెలాకరులో అంటే డిసెంబర్ 29న కన్నడ స్టార్ హీరో దర్శన్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. కంటీర టైటిల్ తో తెరకెక్కిన ఈమూవీ రిలీజ్ కు ముస్తాబవుతోంది. ఈక్రమంలో టీమ్ అంతా ప్రమోషన్లలో బిజీ అయింది.
యంగ్ డైరెక్టర్ తో ఘనంగా నటుడు ప్రభు కూతురు ఐశ్వర పెళ్లి, స్టార్స్ ఎవరెవరు వచ్చారంటే..?
తాజాగా, కంటీర మూవీ టీం విలేకరుల సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా దర్శన్‌కు సలార్, డంకీ మూవీల గురించి ఓ ప్రశ్న ఎదురైంది. కొన్ని రోజులు అటు ఇటుగా ఈ రెండు ప్యాన్ ఇండియా సినిమాలు కన్నడనాట విడుదల అవుతున్నాయి కదా.. మరి మీ సినిమా విషయంలో భయంగా లేదా?.. భారీ చిత్రాలు రిలీజ్ కు ఉన్ననేపథ్యంలో మీ సినిమా రిలీజ్ డేట్ ఏమైనా మార్చుకుంటారా అని అడిగారు. దాంతో దర్శన్ తన మనసులో మాట బయట పెట్టారు. ఈ ప్రశ్నకు ఘాటుగా సమాధానంచెప్పారు.
29 తప్పకుండా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మేం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది మన సినిమా, మన ఊరు.. ఎవరికో భయపడి మనం ఎందుకు దూరంగా పారిపోవాలి. మన ఇంటికి రావాలంటే.. వాళ్లకు భయముండాలి. మనకు ఎందుకు భయం. ఇలా ఆ సినిమాలు రాబట్టి.. కన్నడ నాటలో ఉన్నానో.. లేదో అన్న భయం వేస్తోంది. అసలు సినిమా బాగుంటే కన్నడ ప్రేక్షకులే ఆధరిస్తారు...కథ నచ్చితే.. మన చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకెళతారు. అందు కోసం ఎక్కడి నుంచో దిగిరానక్కర్లేదు.. ప్యాన్ ఇండియా ఇమేజ్ కూడా అక్కర్లేదు అన్నారు దర్శన్. అంతే కాదు కంటీర ఒక అచ్చమైన కన్నడ సినిమా. కన్నడ ప్రజల కోసం చేసిన సినిమా.. అని ముగించారు.
Vijayakanth: విజయ్ కాంత్ ఇలా అయిపోయారేంటి..? బోరున విలపిస్తున్న అభిమానులు
దాంతో దర్శన్ మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సలార్ మూవీ గురించి ప్రత్యక్ష్యంగా అనకపోయినా.. ఈసినిమా గురించే దర్శన్ విమర్షించారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతే కాదు కన్నడ హీరోలు ఎన్నో తెలుగు రీమేక్ సినిమాలు చేశారు.. అయినా సలార్ దర్శకుడు, నిర్మాతలు కన్నడవారే కదా.. అలాంటప్పుడు సలార్ కూడా కన్నడ సినిమానే అవుతుంది కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకా కొంతమంది దర్శన్ మాటల్ని తప్పుబడుతున్నారు. సినిమా ఏ భాషకు చెందినది అయినా.. ముందు గౌరవించటం నేర్చుకోవాలని అంటున్నారు. మరి ఈ వ్యాక్యల విషయం ఎంత వరకూ వెళ్తుందో చూడాలి.
