Asianet News TeluguAsianet News Telugu

అదృష్ట దేవతను గదిలోకి లాక్కెళ్లి నగ్నంగా మార్చాలి... కన్నడ స్టార్ దర్శన్ వివాదాస్పద కామెంట్స్!

కన్నడ స్టార్ హీరో అదృష్ట దేవతపై చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. అదృష్ట దేవతను పడగక గదికి తీసుకుపోయి, నగ్నంగా మార్చాలని ఆయన చెప్పడంతో విమర్శలు వెల్లువెత్తున్నాయి. 
 

kannada star darshan controversial comments on goddess luck
Author
First Published Dec 9, 2022, 7:41 PM IST


ప్రజల నమ్మకాలకు సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు మనసు, నోరు అదుపులో ఉండాలి. కెమెరా ముందు ఏది పడితే అది మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నలుగురికి స్ఫూర్తిగా నిలవాల్సిన సెలెబ్రిటీలు స్టేట్మెంట్స్ ఇచ్చే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి. కన్నడ స్టార్ హీరో అదృష్ట దేవతపై చేసిన కామెంట్స్ ఇప్పుడు కన్నడ పరిశ్రమను ఊపేస్తున్నాయి. 

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శన్.. 'అదృష్ట దేవత ప్రతిసారి తలుపు తట్టదు. తలుపు తట్టినప్పుడు చేయి పట్టుకొని బెడ్ రూమ్ లోకి లాక్కెళ్ళాలి. ఆమె బట్టలు విప్పి నగ్నంగా చేయాలి. బట్టలు ఇస్తే అవి ధరించి బయటకు వెళ్ళిపోతుంది' అని కామెంట్ చేశాడు. హిందువులు అదృష్ట దేవతను శ్రీలక్ష్మిగా భావిస్తారు. లక్ష్మిని విష్ణుమూర్తి భార్యగా పూజిస్తారు. ఈ క్రమంలో దర్శన్ కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. 

దర్శన్ కామెంట్స్ హిందూ వర్గాల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీశాయి. మహిళా సంఘాలు కూడా ఒక స్త్రీని వివస్త్రను చేయాలని ఎలా చెబుతారంటూ పెద్ద ఎత్తున దర్శన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలో దర్శన్  దారుణంగా ట్రోల్స్ కి గురవుతున్నాడు. ఈ క్రమంలో దర్శన్ ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.  బహుశా దర్శన్ లక్ ని దేవత భావనలో చూసి ఉండరు. కేవలం ఆ ఫ్యాక్టర్ ని స్త్రీగా అభివర్ణిస్తూ చెప్పి ఉండవచ్చు. వచ్చిన అదృష్టాన్ని వదిలేయకుండా ఒడిసి పెట్టుకోవాలనే అర్థంలో దర్శన్ చేసిన కామెంట్స్ పక్కదోవ పట్టాయి. వివాదానికి కారణమయ్యాయి. 

కెమెరా అసిస్టెంట్ గా పరిశ్రమకు వచ్చిన దర్శన్ కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న సపోర్టింగ్ రోల్స్ చేశాడు. 2001లో విడుదలైన మెజెస్టిక్ మూవీతో ఆయనకు హీరోగా బ్రేక్ వచ్చింది. కన్నడ పరిశ్రమలో మాస్ యాక్షన్ హీరోల్లో ఒకరిగా దర్శన్ ఎదిగారు. ఆయనకు అక్కడ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios