కన్నడ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో కన్నడ సీనియర్ నటుడు.. కన్నడ కళాతపస్విగా పేరుగాంచిన రాజేశ్ కన్ను మూశారు.

కన్నడ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో కన్నడ సీనియర్ నటుడు.. కన్నడ కళాతపస్విగా పేరుగాంచిన రాజేశ్ కన్ను మూశారు.

గత కొంత కాలంగా కన్నడ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా కన్నడ నటులు కన్ను మూస్తున్నారు. యంగ్ స్టార్స్... సీనియర్ స్టార్స్ అని తేడా లేకుండా హార్ట్ ఎటాక్ తో.. అనారోగ్యంతో కన్నడ స్టార్స్ శాశ్వతంగా దూరం అవుతున్నారు. చిరంజీవి సర్జాతో మొదలు పెడితే.. రీసెంట్ గా పునిత్ రాజ్ కుమర్ వరకూ కన్నడ నాట విషాదాన్ని నింపారు. ఇప్పుడు మరో సీనియర్ నటుడిని కన్నడ ఇండస్ట్రీ కోల్పోయింది.

ప్రముఖ నటుడు, కన్నడ కళాతపస్వి గా పేరు తెచ్చుకున్న సీనియర్ యాక్టర్ రాజేశ్‌ కన్నుమూశారు. 89ఏళ్ల వయస్సులో ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. గత వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న రాజేశ్ పరిస్థితి విషమించడంతో ఈరోజు ( ఫిబ్రవరి 19) తెల్లవారుజామున 2.03 గంటలకు తుదిశ్వాస విడిచారు.

రాజేశ్‌ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం కర్ణాటకలోని విద్యారన్యపురలోని తన నివాసానికి తరలించారు.ఈరోజు సాయంత్రమే అంత్యక్రియలు చేయబోతున్నారు. సీనియర్ నటుడి మృతి పట్ల పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదిక గా సంతాపం ప్రకటిస్తున్నారు. అటు కన్నడ పరిశ్రమతో పాటు ఇటు తెలుగు,తమిళ పరిశ్రమలో కూడా ఆయనకు ఆత్మీయులు ఉన్నారు. సీనియర్ నటుడి మరణంతో కన్నడ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి.

రాజేశ్‌ అసలు పేరు విద్యాసాగర్‌. ఈయన 1935లో బెంగళూరులో జన్మించారు. వీర సంకల్ప సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. 1968లో వచ్చిన నమ్మ ఒరు సినిమా ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఎన్నో సినిమాలో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన ఆయన వెండితెరపూ ఓ వెలుగు వెలిగారు.

1960, 70 లో రాజేష్ హీరోగా చాలా సినిమాల్లో నటించారు. ఆతరువాత హీరోగా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. దాదాపు 45 ఏళ్ల కన్నడ సినీ ప్రయాణంలో..దాదాపుగా 150కి పైగా సినిమాల్లో నటించారు. సినిమా జీవితంలో కాని.. ఫ్యామిలీ లైఫ్ లో కాని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా గడిపిన రాజేష్ కు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. రాజేశ్ కుమార్తెలలో ఒకరైనా ఆశారాణిని స్టార్ హీరో అర్జున్ కు ఇచ్చి పెళ్లి చేశారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆయన మరణం కన్నడ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది.