ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో సుదీప్ అభిమానులు, మరో నటుడు దర్శన్ అభిమానులతో గొడవ పడుతున్నారు. దీంతో ఇద్దరి నటుల మధ్య, అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది.

'పహిల్వాన్' సినిమాను దర్శన్ అభిమానులు పైరసీ చేసి సినిమాను నడవకుండా చేస్తున్నారని సుదీప్ అభిమానులు దర్శన్ అభిమానులపై ఆరోపణలు చేస్తున్నారు. దీంతో దర్శన్ నేరుగా ఈ విషయంలో కల్పించుకొని నా అభిమానుల జోలికి రావద్దని, వారిపట్ల ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ ట్వీట్ చూసిన సుదీప్ అభిమానులు అతడికి ధీటుగా బదులిచ్చారు. 

''మీరు మీ అభిమానులను అన్నదాతలు, సెలబ్రిటీలు అని పిలవడం అభిమానులుగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అయితే మీ అభిమానులు వేరే వాళ్ల అన్నం లాక్కొని తింటున్నారు. మేం ఎవరినీ కించపరిచి మాట్లాడలేదు. ఒక నటుడు సినిమాను డీప్రమోట్ చేయడం ఎంత వరకు కరెక్ట్. మీ విషయంలో ఇలా జరిగితే బాధ కలగదా..?'' అంటూ సుదీప్ అభిమానులు దర్శన్ ని ప్రశ్నించారు.

అయితే హీరో సుదీప్ మాత్రం తాను ఎవరి హెచ్చరికలను పట్టించుకోనని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు తన పహిల్వాన్ సినిమా విడుదలైన దగ్గర నుండి చాలా విషయాలు  జరుగుతున్నాయని అవి మంచివి కాదని అన్నారు. అన్ని సార్లు స్పందించాల్సిన అవసరం కూడా లేదని అన్నారు.