ప్రముఖ సినీ నిర్మాత ఆత్మహత్య , కారణం..?
గుండెపోటుతో చనిపోలేదని, ఆత్మహత్యేనని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్నిరోజులుగా జగదీశ్ మానసికంగా బాధపడుతున్నట్లు తెలిసింది.
ప్రముఖ సినీ నిర్మాత, ఇండస్ట్రలియస్ట్ సౌందర్య జగదీశ్ బెంగళూరులోని తన నివాసంలో సూసైడ్ చేసుకున్నారు. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. దీంతో కన్నడ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు జగదీశ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక జగదీశ్ మృతిని ఆయన స్నేహితుడు శ్రేయస్ ధ్రువీకరించారు.
''సౌందర్య జగదీశ్ తన ఇంట్లో సూసైడ్ చేసుకున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ఆయనను ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆరోగ్యం, వ్యాపారంలో ఎలాంటి సమస్యలు లేవు. పోలీసులకు సమాచారం అందించాము. శవపరీక్షలు జరిగాక ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయి" అని శ్రేయస్ తెలిపారు.
ఈ క్రమంలో సౌందర్య జగదీశ్ మృతిపై బెంగళూరు నార్త్ డివిజన్ డీసీపీ సైదులు అదావత్ మీడియాతో మాట్లాడారు. "నిర్మాత సూసైడ్‌పై మాకు ఆదివారం ఉదయం 9.45 గంటలకు సమచారం అందింది. సౌందర్య జగదీశ్ భార్య ఫిర్యాదు చేశారు. జగదీశ్ గుండెపోటుతో చనిపోలేదని, ఆత్మహత్యేనని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్నిరోజులుగా జగదీశ్ మానసికంగా బాధపడుతున్నట్లు తెలిసింది. ఆయన మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం" అని డీసీపీ తెలిపారు.
జగదీష్ కు బెంగుళూరు సిటీలో సొంత పబ్ ఉంది. అలాగే ఆయన బిల్డర్, సినిమా నిర్మాత కూడా. అందుతున్న రిపోర్ట్ లు ప్రకారం...ఆయన సొంత పబ్ వివాదంలో ఇరుక్కుంది. లేట్ నైట్ పార్టీలు కొందరు సినిమా పర్శనాలిటీలు చేసుకుంటున్నారు. దాంతో లైసెన్స్ ని టెంపరరీగా కాన్సిల్ చేసారు.ఈ యాంగిల్ లో కూడా పోలీస్ లువిచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక జగదీష్ మస్త్ మజా మాది, స్నేహితారు వంటి పలు చిత్రాలను నిర్మించారు జగదీశ్. అప్పు- పప్పు చిత్రం ద్వారా తన కుమారుడు నీషేక్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నిర్మాతగానే కాకుండా చిత్రసీమలో పలు విభాగాల్లో కూడా పనిచేశారు. సౌందర్య జగదీశ్ సెక్యూరిటీ గార్డ్ గత నెలలో మరణించగా, ఆయన అత్త రెండు వారాల క్రితం చనిపోయారు.