దాదాపు 8 నెలలు నరకం చూశానంటోంది కన్నడ లేడీ కమెడియన్ ప్రియాంక కామత్. తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వస్తోన్న ప్రియాంక.. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టం గురించి వివరించింది.
కన్నడలోని లేడీ కమెడయిన్ గా లక్షల మంది అభిమానం సొంతం చేసుకుంది ప్రియాంక కామత్. గిచ్చి గిలి గిలి షోచేస్తూ అభిమానులను అలరిస్తోంది హాస్య నటి. అయితే అంతా హ్యాపీగా సాగిపోతున్న టైమ్ లో.. ప్రియాంక జీవితంలో అనారోగ్యం కుదిపేసింది. అంతే కాదు ఆమె చావు అంచులదాకా వెళ్లి వచ్చింది. చావుదగ్గరకు వచ్చినా..ఎదిరించి నిలబడింది ప్రియాంక. తన ప్రియుడి సపోర్ట్ తో జీవం పోసుకుంది. గతేడాది డిసెంబర్ లో ప్రియుడు అమిత్ పెళ్లి చేసుకున్న ప్రియాంకకు వెన్నెముక సంబంధించిన సమస్యలతో బాధపడింది.
ప్రియాంకకు వచ్చింది చిన్నా చితక సమస్య కాదు.. ఆమె దాదాపు దాదాపు నడవలేని స్థితికి చేరుకుంది ఆమె. ఒకటీ రెండు రోజులు కాదు.. వారం పదిరోజులు కూడా కాదు.. దాదాపు ఎనిమిది నెలలపాటు బెడ్ కే పరిమితమై.. నరకం చూసింది ప్రియాంక. ఆ తర్వాత ఎన్నో కష్టాలు ఓర్చుకుని అనారోగ్యం నుంచి కోలుకుంది కన్నడ కామెడీ స్టార్. హాస్యనటి జీవితంలో ఈ కష్టాల రోజులు గురించి తెలుసుకుని ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు.
ఇక తన అనారోగ్యం గురించి మాట్లాడుతూ.. ఈ ఆపద సమయంలో తన భర్త తనకు అండగా నిలిచారని గర్వంగా చెపుతుంది ప్రియాంక. తన భర్తే తనకు పునర్జన్మ ప్రసాధించాడంటోంది. కేవలం నిశ్చితార్ధం మాత్రమే జరిగిన తరువాత తనకు ఈసమస్య వచ్చిందని.. అయితే పెళ్ళి కాన్సిల్ చేసుకుని వెళ్లకుండా.. తననే భార్యగా ఫిక్స్ అయ్యి.. తనకు జీవితాన్నిచ్చాడంటూ.. ఎమోషనలైంది ప్రియాంక. ఆమె మాట్లాడుతూ.." గతేడాది అమిత్తో నిశ్చితార్థం జరిగింది. కొన్ని నెలలకే నాకు వెన్నెముక సమస్యలు వచ్చాయి. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత..మరో రెండు శస్త్రచికిత్సలు కూడా జరిగాయి. నాశరీరానికి 70 శాతం ఇన్ఫెక్షన్ వచ్చింది. నేనుబతికే అవకాశాలు 50 శాతం మాత్రమే అని డాక్టర్స్ చెప్పారు అని వివరించిందిప్రియాంక.
నా శరీరంలో స్కూలు, రాడ్లు ఫిక్స్ చేశారు.. దీని వల్ల నేను దాదాపు 8 నెలలు మంచానికే పరిమితమయ్యా ఈ 8నెలలు నరకం చూశాను.. అంతే కాదు.. ఇప్పటికి ఆలస్యం కాలేదు.. నువ్వు వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకో అని అమిత్ కు చెప్పాను.. నన్ను విడిచిపెట్టమని కూడా సలహా ఇచ్చాను కానీ అతను కష్టకాలంలో నాకు అండగా నిలిచాడు. అంతే కాదు తను నా డ్రెస్సింగ్, డైపర్ ప్యాడ్లు మార్చడంలో కూడా నాకు సహాయం చేసేవాడు.' అంటూ చెప్పుకొచ్చింది. తాను కోలుకున్నాక తన జీవితం హ్యాపీగా ఉంది అంటోంద ప్రియాంక. ఆదర్శ జంట అనిపించుకుంటున్న వీరి వివాహం డిసెంబర్ 2022 లో జరిగింది. పెళ్ళికి ముందే ఇన్ని కష్టాలు ఫేస్ చేయడంతో.. ప్రస్తుతం చాలా హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు కపుల్.
