లాక్‌డౌన్ సమయంలో ఎంతోమంది సినీతారలు ఓ ఇంటివారయ్యారు. గ్రాండ్‌గా చేసుకునే వారు నలుగురితోనే తతంగం ముగించేసుకోగా.. సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాలని భావించిన సెలబ్రిటీలకు బాగా ప్లస్ అయ్యింది.

ఈ క్రమంలో శాండిల్‌వుడ్‌కు చెందిన ప్రముఖ నటి మయూరి క్యాటరీ లాక్‌డౌన్ సమయంలో సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. తన స్నేహితుడైన అరుణ్‌ను ఆమె శుక్రవారం ఉదయం స్థానిక శ్రీ తిరుమలగిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు.

వీరిద్దరి పెళ్లికి అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కాగా మయూరి తన వివాహానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసేవరకు ఆమె వివాహం గురించి అటు అభిమానులకు గాని, ఇటు సినీ వర్గాలకు కానీ తెలియకపోవడం గమనార్హం.

‘‘అరుణ్, నేను ఇవాళ ఉదయం పెళ్లి చేసుకున్నాం. పదేళ్ల స్నేహానికి శుక్రవారం అర్ధవంతమైన ముగింపు లభించింది. మా పెళ్లికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే తెలియజేస్తానని మయూరి పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా భర్త మూడు ముళ్లు వేస్తున్న వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Yes I am married❤️ 12/06/2020 10 years of friendship given a meaning today ❤️ Vl update more shortly

A post shared by mayuri (@mayurikyatari) on Jun 11, 2020 at 7:57pm PDT