ప్రముఖ కన్నడ నటి, నృత్యకారిణి జయశ్రీ రామయ్య బుధవారం నాడు పోలీసులను ఆశ్రయించారు. ఆస్తి కోసం తన మేనమామ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని జయశ్రీ సీకె అచ్చుకట్టెపోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఆ తరువాత మీడియాలో మాట్లాడిన ఆమె తన మావయ్యపై ఆరోపణలు చేసింది. ఆస్తికి సంబంధించి మేనమామ గిరీష్ చాలా కాలంగా తనతో పాటు తల్లిని కూడా వేధింపులకు గురి చేస్తున్నాడని.. ఈ విషయమై ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి హనుమంత నగర్‌లో ఉన్న తమ ఇంటికి వచ్చి గొడవ చేసి తన తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఆరోపణలు చేసింది.

తన వస్త్రాధరణపై అసభ్య పదజాలాలతో దూషించాడని చెప్పుకొచ్చారు.  విచారణకు హాజరు కావాలంటూ జయశ్రీతో పాటు గిరీశ్‌కు కూడా పోలీసులు సూచించారు.