విలక్షణ నటుడు విజయ్ సేతుపతి సరసన సమంత, నయనతార నటించిన తాజా చిత్రం కన్మణి రాంబో ఖతీజా. కన్మణి రాంబో ఖతీజా చిత్రం నేడు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. 

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి సరసన సమంత, నయనతార నటించిన తాజా చిత్రం కన్మణి రాంబో ఖతీజా. కన్మణి రాంబో ఖతీజా చిత్రం నేడు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకుడు. నయనతార సొంత ప్రొడక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కింది. 

సౌత్ లో మంచి క్రేజ్ ఉన్న ముగ్గురు స్టార్స్ నటిస్తున్న చిత్రం అయినప్పటికీ మినిమమ్ బజ్ కూడా ఏర్పడలేదు. దీనితో ఈ ప్రభావం కలెక్షన్స్ పై తీవ్రంగా ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రానికి 2.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 

ఒకవైపు కెజిఎఫ్ 2 ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. రేపటి నుంచి మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ నటించిన ఆచార్య చిత్రం సునామీలా బాక్సాఫీస్ వైపు దూసుకురాబోతోంది. అందుకే కన్మణి రాంబో ఖతీజా చిత్రాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. 

చిత్ర యూనిట్ కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ మొదలైంది. దీనితో రికవరీ కష్టమే అని అంటున్నారు. సో వీలైనంత త్వరగా ఓటిటిలో రిలీజ్ చేస్తే మంచి డీల్ కుదిరే అవకాశం ఉంది. అలాగైనా పెట్టుబడిని వెనక్కి తెచ్చుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం నిలబడలేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 

విగ్నేష్ శివన్, నయన్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు. కాబట్టి వారి రెమ్యునరేషన్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక మిగిలింది సమంత, విజయ్ సేతుపతి రెమ్యునరేషన్స్ పక్కన పెడితే ఈ చిత్ర నిర్మాణానికి అయినా ఖర్చు తక్కువే. సో థియేట్రికల్ రన్ ఫెయిల్ అయినప్పటికీ.. ఓటిటి, శాటిలైట్ రైట్స్ ద్వారా నయన్, విగ్నేష్ శివన్ పెట్టుబడి వెనక్కి తెచ్చుకునే అవకాశం ఉంది. థియేట్రికల్ రన్ లో బయ్యర్లకు భారీ లాస్ తప్పేలా లేదు.