పిల్లల్ని కనాలనిపిస్తోందంటున్న కంగనా రనౌత్ గతంలో బ్లూ ఫిలింలో నటించడానికీ సిద్ధపడ్జానంటున్న కంగన ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనిపిస్తోందట
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్ ఓ సంచలన విషయాన్ని వెల్లడించింది. జాతీయ అవార్డు గ్రహీత అయిన కంగన ఓ దశలో బ్లూ ఫిల్మ్‌లో నటించేందుకు సిద్ధపడిందట. అయితే అదృష్టవశాత్తూ ‘గ్యాంగ్‌స్టర్’లో అవకాశం రావడంతో బ్లూ ఫిల్మ్ నుంచి బయటపడిందట. ఆ విషయాన్ని ఓ కార్యక్రమంలో వెల్లడించింది కంగన.
‘నాకు 2006లో నా అరంగేట్ర సినిమా ‘గ్యాంగ్‌స్టర్’ కంటే ముందు ఓ ఆఫర్ వచ్చింది. ఆ సినిమా ఫోటో షూట్‌కు కూడా వెళ్లా. దుస్తులేమీ లేకుండా కాస్ట్యూమ్ రోబ్ ఇచ్చారు. అప్పుడే అర్థమైంది అది ఓ నీలిచిత్రమని. అయినా ఫర్వాలేదు.. చేద్దామనుకున్నా. ఇంతలోనే ‘గ్యాంగ్‌స్టర్’ ఆఫర్ వచ్చింది. ఆ కథ నచ్చడంతో అదే చేశాను. కానీ, ఆ బ్లూ ఫిల్మ్ నిర్మాత నా మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ సినిమా చేయకపోవడం వల్ల చాలా కష్టాలు పడ్డాను. అప్పుడు నా వయసు 17 ఏళ్లు. ‘గ్యాంగ్‌స్టర్’ ఆఫర్ కనుక రాకపోయి ఉంటే కచ్చితంగా ఆ సినిమా చేసి ఉండేదాన్ని. అప్పట్లో నేను ఉన్న పరిస్థితులే ఆ నీలి చిత్రానికి సిద్ధపడేలా చేశాయ’ని కంగన వెల్లడించింది.
ఇక కంగనా రనౌత్ వయసు 30 ఏళ్ళకి దగ్గరవుతోంది. ఈ నేపత్యంలో ఆమెలో పిల్లల్ని కనాలనే కోరిక పెరుగుతోంది. ఈ విషయమై ఆమె స్పందిస్తూ ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి కోరికలేదు, కానీ ఈ మధ్య నా మయసు అంతా పిల్లలపైకే మళ్లుతోంది అని చెబుతోంది. ఇంకా పెళ్లి కూడా కాలేదు... అప్పుడే ఈ కోరిక ఏమిటో అని అడిగితే... 30 సంవత్సరాలకు దగ్గర్లో ఉన్నాను కనుక ఇలాంటి కోరిక కలుగుతోందేమో నాకు తెలియదు. వీలైనంత త్వరగా నా కోరికను తీర్చుకుంటాను. త్వరలో నాకు తగిన వాడిని చూసుకుని పెళ్లి చేసుకుని వెంటనే పిల్లల్ని కనేస్తాను అంటోంది.
