చంద్రముఖి పాత్రలో  జ్యోతిక, శోభన లాంటి హీరోయిన్లు అద్భుతంగా నటించారు. అంతోఇంతో భయపెట్టారు కూడా. ఇక ఇప్పుడు అదే పాత్రలో అంతకుమించి అంటూ నటించడానికి రెడీ అవుతుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. 

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌, నయనతార, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా చంద్రముఖి. 2005 లో రిలీజ్ అయిన ఈ హారర్‌ కామెడీ మూవీ తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే అప్పుడే ఈ సినిమాకు సీక్వెల్ వస్తుంది అనుకున్నారంతా. కాని రజనీ కాంత్ ఈసినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో.. సీక్వెల్ ప్రయత్నం ఆగిపోయింది. అయితే ఇన్నాళ్లకు ఈసినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. 

అయితే ఈసారి చంద్రముఖి సీక్వెల్ లో రజనీ కాంత్ కు బదులుగా రాఘవ లారెన్స్‌ హీరోగా ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. చంద్రముఖిని తెరకెక్కించిన పి.వాసు దర్శకుడిగా.. ఈసినిమా రాబోతోంది. అయితే చంద్రముఖి పాత్రలో ఎవరిని తీసుకోవాలి అని చాలా రోజలుగా హీరోయిన్ వేటలో ఉన్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్‌ తార కంగనారనౌత్‌ ను ఎంపిక చేశారు. 

అయితే చంద్రముఖి సినిమాలో జ్యోతిక పాత్రకు కొనసాగింపుగా కంగనారనౌత్‌ కనిపించనుంది. ఈ పాత్రకు డాన్స్ కచ్చితంగా వచ్చి ఉండాలి. ఇక క్లాసికల్ డాన్స్ లో కంగనాకు చక్కటి ప్రవేశం ఉండటంతో ఆమెను ఈ సినిమాకు ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈమూవీలో రాజనర్తకిగా కంగనారనౌత్‌ కనిపించనుందట. సినిమా అంతటికి ఈ క్యారెక్టర్ ప్రధానాకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.

అంతే కాదు చంద్రముఖి సీక్వెల్‌ సినిమాలో నటిస్తున్నట్టు కంగనారనౌత్‌ స్వయంగా సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మధ్య సినిమాలు తగ్గించి.. కాంట్రవర్సీయల్ మేటర్స్ లో స్పందిస్తూ.. తెగ హడావిడి చేస్తుంది కంగనా. ఇప్పటికే ఫైర్ బ్రాండ్ గా ఉన్న కంగనా చంద్రముఖి గా పర్ఫెక్ట్ సెలక్షన్ అంటున్నారు ఆడియన్స్.