గతేడాది రిలీజ్‌ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్‌ 10న థియేటర్లోనే రిలీజ్‌ చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. 

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `తలైవి`. అరవింద స్వామి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఏ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించారు. మాజీ సీఎం, అలనాటి నటి జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఇందులో జయలలితగా కంగనా రనౌత్‌ నటిస్తుండగా, ఎంజీఆర్‌గా అరవింద స్వామి నటిస్తున్నారు. 

గతేడాది రిలీజ్‌ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్‌ 10న థియేటర్లోనే రిలీజ్‌ చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాని నిర్మిస్తున్న విబ్రి మీడియా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించించింది. `ఐకానిక్‌ వ్యక్తి కథని పెద్ద తెరపైనే చూడాలి. తలైవి కోసం, ఆమె సినిమా ప్రపంచంలోకి సూపర్‌స్టార్‌ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నందున, ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 10న విడుదల చేయబోతున్నాం` అని తెలిపారు. ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు.

Scroll to load tweet…