బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా గురించి అందరికి తెలిసిందే. హృతిక్ రోషన్ తో వివాదం మొదలుకుని అలియా భట్ వరకు అందరిపై తీవ్రమైన వ్యాఖ్యలతో రెచ్చిపోతోంది. ఇటీవల కంగనాకు సపోర్ట్ గా ఆమె సోదరి రంగోలి వివాదంలోకి ఎంటర్ అయింది. అలియా భట్, ఆమె తండ్రి మహేష్ భట్ పై విమర్శలతో చెలరేగిన రంగోలి తాజాగా రిచా చద్దాని టార్గెట్ చేసింది. రిచా చద్దా హాట్ బ్యూటీగా బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది. 

ఓ టివి షోలో రిచా చద్దా కంగనా రనౌత్ గురించి పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. తనకు ఇండస్ట్రీలో ఎవరితో అయినా సమస్య ఉంటే పబ్లిక్ ఫ్లాట్ ఫామ్ లో వెల్లడించాను. వారితోనే నేరుగా మాట్లాడుతా. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తా అని రిచా చద్దా తెలిపింది. ఈ వ్యాఖ్యలకు కంగనా సోదరి రంగోలి ఆగ్రహం వ్యక్తం చేస్తూ రిచాపై అటాక్ మొదలు పెట్టింది. 

రిచా చద్దా పనీపాటా లేక ఆలా మాట్లాడుతోంది. ఇండస్ట్రీలో మూవీ మాఫియాకు కొమ్ము కాసే వ్యక్తి అనే అర్థం వచ్చేలా బూతు పదజాలం ఉపయోగించింది. రిచాపై రంగోలి చేసిన అసభ్యకరమైన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విభేదాలు ఉన్న వారందరితో నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుందా అని రిచాని రంగోలి ప్రశ్నించింది. రిచా ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలి. కంగనా రనౌత్ గత 14 ఏళ్లుగా బాలీవుడ్ లో ఒంటరి పోరాటం చేస్తోంది. కంగనాని చూసి స్వతంత్రంగా బతకడం నేర్చుకో అంటూ రిచాకు రంగోలి సలహా ఇచ్చింది.