హీరోయిన్ కంగనా రనౌత్ పేరెంట్స్ నేడు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. ఆషా, అమర్ దీప్ పెళ్లి రోజు నేపథ్యంలో ఓ ఆసక్తికర స్టోరీ పోస్ట్ చేశారు కంగనా. తాము అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాం అని కంగనాకు వారు అబద్దం చెప్పారట. నిజానికి ఆషా,అమర్ దీప్ లది లవ్ మ్యారేజ్ అట. ఆషాను అమర్ దీప్ ఓ బస్టాండ్ లో చూశాడట. అప్పటి నుండి ఆమెను ఫాలో అవడంతో పాటు ప్రేమలో దించాడట. 


అయితే ఆషా వాళ్ళ నాన్నగారు మాత్రం ఈ పెళ్ళికి అసలు ఒప్పుకోలేదట. ఆషా కోసం గవర్నమెంట్ జాబ్ ఉన్న ఓ అబ్బాయిని నిర్ణయించాడట. అయితే కంగనా తల్లి ఆషా మాత్రం అమర్ దీప్ నే పెళ్లి చేసుకుంటానని తండ్రితో పోరాటం చేశారట. దానితో ఆషా తండ్రి కన్విన్స్ కావడంతో పాటు అమర్ దీప్ తో వివాహం జరిపించారట. ఈ ఆసక్తికర లవ్ స్టోరీని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు కంగనా. 


ఇక కంగనా నటించిన మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ తలైవి విడుదల వాయిదా పడింది. కరోనా నేపథ్యంలో చిత్ర విడుదల తేదీ పోస్ట్ ఫోన్ చేశారు. కొత్త విడుదల తేదీ త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలియజేశారు. తమిళ రాజకీయ సంచలనం జయలలిత బయోపిక్ గా తలైవి తెరకెక్కింది. ఏ ఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అరవింద స్వామి ఎంజీఆర్ రోల్ చేశారు. 


అలాగే ఈ ఏడాది ప్రకటించిన జాతీయ అవార్డ్స్ గాను కంగనా ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్నారు. మణికర్ణిక చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ నటి అవార్డు దక్కింది. మణికర్ణిక స్వాతంత్ర్య సమరయోధురాలు ఝాన్సీ జీవిత గాధ గా తెరకెక్కింది.