ప్రియాంక చోప్రాపై బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ షాకింగ్‌ కామెంట్‌ చేసింది. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడటంపై ఆమె మండిపడింది. ఓ మీడియా కథనాన్ని ఉద్దేశిస్తూ కంగనా ఈ వ్యాఖ్యలు చేసింది.  

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రాపై బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ షాకింగ్‌ కామెంట్‌ చేసింది. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడటంపై ఆమె మండిపడింది. ఓ మీడియా కథనాన్ని ఉద్దేశిస్తూ కంగనా ఈ వ్యాఖ్యలు చేసింది. ఒకప్పుడు మోడీకి అభిమానిగా ఉన్న ప్రియాంక ఇప్పుడు ఆయన్ని విమర్శించే వ్యక్తిగా మారిందని వ్యాఖ్యానించింది. 

ఇన్‌ స్టా స్టోరీస్‌లో కంగనా ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో ఆమె మాట్లాడుతూ, `ఇది జర్నలిజంలోనే మాత్రమేకాదు, ప్రతి రంగంలోనూ ఉంది. ప్రియాంక చోప్రా ఒకప్పుడు జాతీయవాదిగా ఉండేవారు. ఇప్పుడు లౌకిక కుక్కపిల్ల గా మారిపోయింది. మోడీజీకి అతిపెద్ద అభిమానిగా ఉన్న ఆమె ఇప్పుడు ఉద్వేగభరితమైన విమర్శకురాలిగా, ద్వేషిగా మారిపోయింది` అంటూ తనదైన స్టయిల్‌ వ్యాఖ్యలు చేసింది. కంగనా వ్యాఖ్యలు బాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతున్నాయి. మరి దీనిపై ప్రియాంక ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది. 

గతేడాది నుంచి సుశాంత్‌ డెత్‌ మిస్టరీపై, బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియాపై, మహారాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది కంగనా. ఇటీవల ఆమె బెంగాల్‌ హింసపై చేసినవ్యాఖ్యాలు వివాదంగా మారడంతో ట్విట్టర్‌ ఆమె అకౌంట్‌ని బ్లాక్‌ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచింది. 

ఇక ప్రస్తుతం కంగనా `ధాకడ్‌` చిత్రంలో నటిస్తుంది. ఈసినిమా షూటింగ్‌ బుడాపెస్ట్ లో జరుగుతుంది. స్పై థ్రిల్లర్‌గా సాగే ఈ చిత్రంలో కంగనా ఏజెంట్‌ అగ్నిపాత్రలో నటిస్తుంది. రుద్రవీర్‌ అనే విలన్‌ పాత్రలో అర్జున్‌ రాంపాల్‌ నటిస్తున్నారు. దీంతోపాటు `తలైవి`, `తేజస్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.