Asianet News TeluguAsianet News Telugu

సోనియా సేన నుంచి బయటపడ్డా.. అందుకు అదృష్టవంతురాలినిః కంగనా

కంగనా సోమవారం ముంబయి వీడి హిమాచల్‌ ప్రదేశ్‌కి వెళ్ళిపోయింది. ఈ సందర్బంగా ట్విట్టర్‌ ద్వారా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సారి ముంబాయి నుంచి సేఫ్‌గా బయటపడ్డానని తెలిపింది. 

kangana ranaut said she was lucky to have   survived in mumbai
Author
Hyderabad, First Published Sep 14, 2020, 4:00 PM IST

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ వారం రోజులు ముంబయిలో ఉండి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని షేక్‌ చేసింది. ఈ రోజు(సోమవారం) ముంబయి వీడి హిమాచల్‌ ప్రదేశ్‌కి వెళ్ళిపోయింది. ఈ సందర్బంగా తాను ట్విట్టర్‌ ద్వారా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముంబయిని పీఓకేతో మరోసారి పోల్చిన కంగనా.. ఈ సారి ముంబాయి నుంచి సేఫ్‌గా బయటపడ్డానని తెలిపింది. 

ముంబయి నుంచి వీడే ముందు కంగనా ట్వీట్‌ చేస్తూ, నా మీద వరుస దాడులు, వేధింపులు.. నా ఇళ్ళు, కార్యాలయాలను కూల్చే ప్రయత్నాలు నన్ను తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. ముంబయిలో ఉన్నన్ని రోజులు నాకు ఎదురైన అనుభవాలు, నా చుట్టూ భారీ భద్రత చూస్తే నేను చేసిన పీఓకే వ్యాఖ్యలు నిజమే అనిపిస్తుంది` అని తెలిపింది. 

ఇక మనాలిలో ల్యాండ్‌ అయిన తర్వాత మరో ట్వీట్‌ చేసింది. `హిమాచల్‌ ప్రదేశ్‌కి తిరిగి వచ్చినందుకు చండీగర్‌ ప్రజలు ఆనందంతో స్వాగతం పలుకుతారు. నా భద్రత గణనీయంగా తగ్గిపోతుంది. అయితే ముంబయి నుంచి సురక్షితంగా వెళ్లడమనేది ఈ సారికి నేను రక్షించబడ్డానని అనిపిస్తుంది. ముంబయిలో ఓ తల్లి బాధను అనుభవించాను. కానీ ఇప్పుడు నేను బతికే ఉన్నందుకు అదృష్టవంతురాలిగా భావిస్తున్నా` అని తెలిపింది. 

ఇంకా కంగనా చెబుతూ, శివసేన సోనియా సేనగా మారిన క్షణం, ముంబయి పరిపాలన తీవ్రవాదంగా మారిన పరిస్థితుల్లో నేను బతికే ఉండటం నిజంగానే అది నా అదృష్టం` అని తెలిపింది. మరోవైపు ఆదివారం కంగనా
మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియర్‌ని, కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అత్వాలేని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని తెలిపింది. అదే సమయంలో తనకు నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. మరి దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios