క్వీన్ సీక్వెల్ కథ రెడీ.. మరి కంగనా రనౌత్ ఏమంటుందంటే..?
కంగనా రనౌత్ నటించిన సూపర్ హిట్ మూవీ క్లీన్. ఈమూవీకి సీక్వెల్ రాబోతోంది. అంతే కాదు ఈసినిమా కథ కూడారెడీగా ఉందట. మరి కంగనా ఈ విషయంలో ఏమంటుందంటే..?
బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో దూసుకుపోతోంది కంగనా రనౌత్. కాంట్రవర్సీక్వీన్ గా పేరు తెచ్చుకుంది. విదాలకు కు కేరాఫ్ అడ్రస్ గా మరిపోయింది. స్టార్స్ ఎవరైనా.. వారిగురించి చెప్పాల్సి వస్తే.. అస్సలు సంకోచించదు. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మాటలు సూటిగా ఉంటాయి. ఎప్పుడు ఏది అనిపిస్తే అది టక్కున అనేస్తుంది బ్యూటీ. అంతే కాదు ఎవరినైనా ఏదైనా అనాలన్నా.. వారు ఎంతటివారు అనేది చూసుకోదు...మాట అనేస్తుంది. అంతే కాదు ఎమైనా అనిపిస్తే అది ముఖం మీదే చెప్పేస్తూ ఉంటుంది. తన మనసులోని భావాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బయటపెడుతూనే ఉంటుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. కంగనా రనౌత్ తన అభిమానుల కోసం రకరకాల ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో కంగనా రనౌత్ సినిమాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్ అవుతున్నాయి. సౌత్ పై ఎక్కువగా కాన్సంట్రేషన్ చేసింది కంగనా. తమిళంలో ఎక్కుగా సినిమాలు చేస్తోంది. అంతే కాదు కంగనా రనౌత్ రాజకీయాల్లోకి రాబోతుందనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. ఇక బాలీవుడ్ నుంచి సపోర్ట్ లేకున్నా.. తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్తోంది కంగనా.
ఇక కంగనా రనౌత్ నటించిన సినిమాల్లో సూపర్ హిట్ మూవీ క్వీన్. ఈ మూవీ 2014 లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ను అందుకుంది. వికాస్ బహ్ల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాగానే ఆడింది. సరిగ్గా పదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్నట్లు వికాస్ బహ్ల్ తాజాగా వెల్లడించారు. కంగనా రనౌత్ క్వీన్ మంచి క్లాసిక్ గా నిలిచిపోయింది. బాలీవుడ్ మూవీలలో మంచి కథతో వచ్చిన సినిమాలలో ఒకటిగా చెప్పవచ్చు.
ఇక ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా సీక్వెల్ వస్తే బాగుండునని అభిమానులు ఆశించారు. అభిమానులు అనుకున్నటటుగానే క్వీన్ 2 కథ రెడీ అయ్యిందంటూ డైరెక్టర్ వికాస్ బహ్ల్ ప్రకటించారు. కేవలం డబ్బు కోసం సినిమా తీయాల్సి వస్తే నాలుగేళ్ల క్రితమే క్వీన్ సీక్వెల్ తీసేవాడినని.. కథ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇంత టైమ్ పట్టిందని ఆయన చెప్పారు. మరి ఈ సినిమాకోసం కంగనా ఎప్పుడు డేట్స్ ఇస్తుందో చూడాలి.