Asianet News TeluguAsianet News Telugu

మ‌ణిక‌ర్ణికాలో కంగ‌నా లుక్ పై హాట్ న్యూస్‌

  • సోష‌ల్ మీడియాలో హాల్‌చ‌ల్ చేస్తున్న ఫోటో
  • క్లారిటీ ఇవ్వ‌ని చిత్ర బృందం
  • మ‌రో చారిత్రాత్మ‌క సినిమాపై క‌న్నేసిన క్రిష్‌
Kangana Ranaut  look attracts

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మణికర్ణిక-ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’. రాణి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. లక్ష్మీబాయిగా కంగనా ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లుకొడుతోంది. ఫొటోలో కంగనా తలపాగా నుంచి ఆభరణాల వరకూ అన్నీ ఆకట్టుకుంటున్నాయి.

 క్రిష్‌ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. కె.వి.విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించిన ఈ సినిమా చిత్రీకరణ జూన్‌ మొదటివారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. కంగనా ఈ సినిమాతో పాటు ‘సిమ్రన్‌’ సినిమాలో నటిస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios