బాలీవుడ్ కాట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఎక్కువగా వివాదాలతో దర్శనమిస్తుంటుందన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సారి కామెంట్స్ తో కాకుండా మంచి పని చేసి వార్తల్లో నిలిచారు. మనసులో ఉన్న అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పే కంగనా బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. 

అయితే ప్రకృతికి సంబందించిన సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుండే ఈ బాలీవుడ్ క్వీన్ ఈ సారి ఓ పని కోసం తనవంతు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. వర్షాలు కురవాలని అడవులు పచ్చగా ఉండాలని సద్గురు ఈషా ఫౌండేషన్ వారు స్టార్ట్ చేసిన కావేరి కాలింగ్ అనే పర్యావరణ సంరక్షణ కార్యక్రమం కోసం కంగనా 42లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. 

12 ఏళ్లలో 242కోట్ల చెట్లు ఉండేలా ఈ కార్యక్రమానికి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. కంగనా ఈ ప్లాన్ కి మద్దతు పలికారు. ప్రస్తుతం ఆమె తమిళనాడు దివగంత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఏఎల్.విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాకు బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు.