బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు మధ్య వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం బీఎంసీ అధికారులు కంగనా ఆఫీస్‌లోని అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అక్కడి చేరుకున్నారు. ముంబై పాలి హిల్‌ ఏరియాలో మణికర్ణిక సినిమా సందర్భంగా ఓ ఆఫీస్‌ను ఏర్పాటు చేసింది కంగనా. ఇటీవల ఆ బిల్డింగ్‌ నింబంధనలకు అనుగుణంగా లేదని, చాలా వాయిలేషన్స్‌ ఉన్నట్టుగా బీఎంసీ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు.

తాజాగా నిబంధనలు మీరి కట్టిన నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు అక్కడకు చేరుకోవటంపై కంగన ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఆఫీస్‌ను రామ మందిరంతో పోలుస్తూ, నిర్మాణాలు కూల్చేందుకు వచ్చిన అధికారులను బాబర్‌ సైన్యంతో పోలుస్తూ ట్వీట్ చేసింది కంగనా. అంతేకాదు చరిత్ర పునారావృతం అవుతుందని, తాను తిరిగి తన ఆఫీస్‌ను యధాథతంగా నిర్మిస్తానంటూ కామెంట్ చేసింది.

అంతేకాదు మరోసారి గతంలో తాను ముంబైని పీఓకేతో పోలుస్తూ చేసిన కామెంట్స్‌నే రిపీట్ చేసింది. `నేను తప్పుకాదని నా శత్రువులు మరోసారి నిరూపించారు. ఇందుకే నేను ముంబైనీ పీఓకేతో పోల్చింది` అంటూ తన ఆఫీస్‌ నిర్మాణాన్ని అధికారులు తొలగిస్తున్న ఫోటోను ట్వీట్ చేసింది. మంగళవారం ఆఫీస్‌ నిర్మాణం తొలగింపు సంబంధించి నోటీసులు బీఎంసీ అధికారులు ఇష్యూ చేశారు. అయితే  కంగన తన లాయర్‌ ఆ నోటీస్‌కు ఇచ్చిన సమాధానాన్ని కూడా సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది.