బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది నటి కంగనా రనౌత్. ఏ విషయం గురించైనా.. కుండ బద్దలు కొట్టే విధంగా మాట్లాడుతుంది. తాజాగా ఆమె అలియా, రణబీర్ కపూర్ లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

వారిద్దరికీ తమ రొమాన్స్ గురించి, ముద్దు ముచ్చట్ల గురించి చెప్పడానికి టైం ఉంటుందని కానీ దేశం గురించి మాట్లాడే తీరక లేదంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ఇటీవల అలియా.. ఫిలిమ్ ఫేర్ అవార్డు అందుకున్న తరువాత స్టేజ్ పై రణబీర్ కి 'ఐలవ్యూ' చెప్పింది.

దీని గురించి మీడియాలో మాట్లాడిన కంగనా.. ''నాకు ఏదైనా విషయం నచ్చకపోతే నేను ఈ విధంగానే స్పందిస్తాను. నాకు తెలియక అడుగుతున్నా.. అలియా, రణబీర్ లను యంగ్ కిడ్స్ అంటారేంటి..? రణబీర్ వయసు 37, అలియాకి 26.. ఇంకా వారిద్దరూ పిల్లలేంటి..?'' అంటూ మండిపడింది.

వారిద్దరికీ ప్రేమ గురించి మాట్లాడడానికి, ముద్దుముచ్చట్ల గురించి చెప్పడానికి టైం ఉంటుంది కానీ దేశం గురించి మాట్లాడమంటే మాత్రం నోరు మెదపరు.. ఇదేం పద్ధతి అంటూ యంగ్ కపుల్ పై విరుచుకుపడింది. ప్రస్తుతం కంగనా 'మెంటల్ హై క్యా' అనే సినిమాలో నటిస్తోంది.