బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా 'మెంటల్ హై క్యా'. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి వివాదాలు అలముకున్నాయి.

మానసిక రోగులను అవమానపరిచేలా ఈ సినిమా టైటిల్ ఉందంటూ 'ఇండియన్ సైకియార్టిస్ట్ సొసైటీ(ఐపీఎస్), దీపికా పడుకొనే 'ది లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్' లతో పాటు సీబీఎఫ్ సీ చీఫ్ ప్రసూన్ జోషికి లేఖ రాశాయి. టైటిల్ మార్చాలని డిమాండ్ చేశాయి. దీంతో తాజాగా కంగనా సీబీఎఫ్ సీ ని కలిసింది.

అవసరమైన టైటిల్ మార్చడానికి సిద్ధంగా ఉన్నట్లు అదే విషయాన్ని మీడియాకు వెల్లడించింది. ఈ క్రమంలో సినిమా పేరు 'జడ్జిమెంటల్ హై  క్యా'గా మార్చినట్లు బాలాజీ టెలీ ఫిలిమ్స్ వెల్లడించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 26న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.