బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఎం మాట్లాడినా ఒక సెన్సేషన్. చిన్న కామెంట్ చేసినా బాలీవుడ్ మీడియా ఎంతగా వైరల్ చేస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఎం మాట్లాడినా ఒక సెన్సేషన్. చిన్న కామెంట్ చేసినా బాలీవుడ్ మీడియా ఎంతగా వైరల్ చేస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇకపోతే రీసెంట్ గా అమ్మడు సౌత్ హీరోల్లో మహేష్ నటించడం అంటే చాలా ఇష్టమని తనదైన స్టైల్ లో చెప్పేసరికి ఆ డైలాగ్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన ఘాన్సీ లక్ష్మి బాయ్ బయోపిక్ లో కంగనా నటించిన సంగతి తెలిసిందే. మణికర్ణిక అనే ఆ సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తి చేసి మొన్న ట్రైలర్ వదిలిన అమ్మడు అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకుంది. వచ్చే ఏడాది జనవరి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రమోషన్స్ తో కంగనా సినిమాకు హైప్ తేవడానికి ప్రయత్నాలు చేస్తోంది.
రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌత్ లో అవకాశం వస్తే ఎవరితో నటించడానికి ఎక్కువగా ఇష్టపడతారనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తో అవకాశం వస్తే వదిలే ప్రసక్తే లేదని ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాను అని కంగనా వివరణ ఇచ్చింది. దీంతో తెలుగులో మణికర్ణికకు దాదాపు క్రేజ్ వచ్చినట్టే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
