టాలీవుడ్ లో రాఘవలు లారెన్స్ తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ని తెచ్చుకున్నాడు. ముని సీక్వెల్స్ తో కోలీవుడ్ లో ఎలాగైతే సక్సెస్ కొడుతున్నాడో మొదటి నుంచి ఇక్కడ కూడా అదే రేంజ్ లో హిట్టందుకుంటున్నాడు. ఇక నేడు ముని 4: కాంచన 3 రిలీజైన సంగతి తెలిసిందే. 

ఈ సినిమాకు మాస్ ఏరియాల నుంచి హిట్ టాక్ వస్తున్నప్పటికీ మల్టిప్లెక్స్ లలో కాస్త యావరేజ్ టాక్ వస్తోంది. దాదాపు రెండు వేలకు పైగా స్క్రీన్ లలో రిలీజైన కాంచన 3 మొదటి రోజు తమిళనాడులో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ని అందుకుంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సినిమా 10 కోట్లను రాబట్టినట్లు సమాచారం. 

ఇక సినిమాలో పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే.. ఎప్పటిలానే రాఘవ లారెన్స్ తన నట విశ్వరూపంతో తెరపై అద్భుతంగా కనిపించాడు. హై గ్రాఫిక్స్ - బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యింది. 

సినిమా కథలో పెద్దగా కొత్త పాయింట్ ఏమి లేదు. అంగవైకల్యం కలిగిన బాలలను పోషిస్తున్న ఒక వ్యక్తిని విలన్స్ చంపడం.. ఆ తరువాత అతను దెయ్యంగా మారి లారెన్స్ శరీరంలోకి ఆవహించడంతో అప్పుడు మెయిన్ కథ మొదలవుతుంది. 

కామెడీ మాత్రం సినిమాలో కొత్తగా ఏమి లేదు. గత సినిమాల్లో ఉన్న మాదిరిగానే హారర్ ప్లస్ కామెడీని మిక్స్ చేసినట్లు అనిపిస్తుంటుంది. ఫైనల్ గా మాస్ ఆడియెన్స్ మెచ్చే అంశాలు సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. హారర్ డోస్ అక్కడక్కడా మితిమీరినట్లు అనిపించినా కూడా క్లైమాక్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ ఆడియెన్స్ కి మంచి కిక్ ఇస్తాయి. అదే విధంగా ముని 5కి కూడా లారెన్స్ బాట వేసినట్లు పోస్టర్ తో చెప్పేశాడు. ఫైనల్ గా సినిమాపై ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా వెళితే నచ్చే అవకాశం ఉంది.