డ్యాన్స్ మాస్టర్ గా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ దర్శకుడి గాను మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హారర్ కామెడీ అండ్ ఎమోషన్ ని కలిపి ముని సిరీస్ లతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక నెక్స్ట్ నాలుగవ చిత్రమైన కాంచన 3తో రాబోతున్నాడు. 

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఒక పాట మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. కాంచన 2: గంగ సినిమా లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. 2015లో వచ్చిన ఆ సినిమా మంచి లాభాలను అందించింది. దీంతో ఈ సారి కాంచనా 3 సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు.

కళానిధి మారన్ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అసలైతే ఈ ఏడాది డిసెంబర్ లోనే సినిమాను రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు. కానీ  గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం కావడం వల్ల విడుదలను వచ్చే ఏడాది సమ్మర్ కి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఓవియా - వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.