హారర్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం లారెన్స్ కు వెన్నతో పెట్టిన విద్య. కలెక్షన్స్ లో కాంచన 3 ఈ ఏడాది టాప్ 5 సౌత్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా లారెన్స్ భయపెడుతూ నవ్వించిన విధానం మాస్ ఆడియెన్స్ ని బాగానే ఆకట్టుకుంటోంది. 

కాంచన 3 సినిమా రీసెంట్ గా 100 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది. సినిమా విడుదలైన 11 రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ వద్ద సెంచరీ కొట్టేసింది. దీంతో ఈ ఏడాది విడుదలైన టాప్ హిట్స్ లో కాంచన 3 కూడా నిలిచింది. ఈ ఏడాది రిలీజైన రజినీకాంత్ పేట - అజిత్ విశ్వాసం - F2 - మోహన్ లాల్ లూసిఫర్ సినిమాలు 100 కోట్ల కలెక్షన్స్ ను అందుకొని టాప్ లో నిలిచాయి.

ఆ తరువాత కాంచన 3 ఆ రికార్డును అందుకుంది.  ప్రస్తుతానికి కూడా రెండు భాషల్లో (తమిళ్ - తెలుగు) సినిమాకు మంచి కలెక్షన్స్ అందుతున్నాయి. సమ్మర్ హాలిడేస్ కావడంతో జనాలు అన్ని రకాల సినిమాలపై ఓ కన్నేస్తున్నారు. ఇక మహర్షి వచ్చే వరకు మీడియం సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద రారాజులు. మరి మొత్తంగా కాంచన 3 సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ ను అందుకుంటుందో చూడాలి.