రాఘవ లారెన్స్ నటించిన 'కాంచన 3' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి బ్యాడ్ టాక్ వచ్చినా.. ఆ ఎఫెక్ట్ కలెక్షన్లపై కనిపించడం లేదు. మాస్ సెంటర్స్ ఈ సినిమా తన సత్తా చాటుతోంది.

నాని 'జెర్సీ' కంటే లారెన్స్ 'కాంచన 3' బీ,సీ సెంటర్స్ లో బాగా ఆడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంచన 3 థియేట్రికల్ హక్కులను  రూ.16 కోట్లకు అమ్మారు. తొలిరోజే ఈ సినిమా ఆరు కోట్ల షేర్ రాబట్టింది. తొలివారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.9 కోట్ల షేర్ రాబట్టింది. 

ఏరియాల వారీగా కలెక్షన్లు.. 

నైజాం.................................. రూ3.05 కోట్లు 
సీడెడ్...................................రూ.2.0 కోట్లు
ఉత్తరాంధ్ర............................రూ.0.96 కోట్లు 
తూర్పుగోదావరి.................... రూ.0.76 కోట్లు 
పశ్చిమ గోదావరి.....................రూ.0.46 కోట్లు 
కృష్ణా.....................................రూ.0.69 కోట్లు 
గుంటూరు..............................రూ.0.77 కోట్లు 
నెల్లూరు................................రూ.0.32 కోట్లు 

మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులకు గాను రూ.9.01 కోట్ల షేర్ రాబట్టింది.