మాస్ హీరో రవితేజ.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. అయినప్పటికీ రవితేజతో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు మైత్రి మేకర్స్ వారు.

రవితేజతో వరుసగా రెండు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంది మైత్రి సంస్థ. స్క్రిప్ట్ మీద ఖర్చు, అడ్వాన్స్ లు కూడా ఇచ్చింది. ఆ కారణంగానే తమ బ్యానర్ కి ఫ్లాప్ ఇచ్చినప్పటికీ రవితేజతో మరో సినిమా చేయడానికి రిస్క్ తీసుకుంటుంది. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తమిళ 'తెరి' రీమేక్ ను తెలుగులో చేయబోతున్నారు.

ఈ కథను మొదట పవన్ కళ్యాణ్ కోసం అనుకున్నప్పటికీ ఆయన రాజకీయపరంగా బిజీగా ఉండడంతో రవితేజతో ప్రొసీడ్ అవుతున్నాడు. ఈ విషయాన్ని రవితేజ కూడా ఓ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశాడు. అయితే కొన్ని సమస్యలు రావడంతో సినిమాకి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాను పనులు మొదలుపెట్టారు.

ఈ సినిమాకి టైటిల్ గా 'కనకదుర్గ' ఏ టైటిల్ ని అనుకుంటున్నారని సమాచారం. దాదాపు ఇదే టైటిల్ ను ఫైనల్ చేయాలని చూస్తున్నారు. మరి ఈ సినిమా అయినా.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థకి సక్సెస్ ఇస్తుందేమో చూడాలి!