ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ(95) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం దిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన గతంలో కేంద్ర మంత్రిగా, బార్ కౌన్సిల్ ఛైర్మన్ గా పనిచేశారు.

దేశంలో పేరెన్నిక గల న్యాయవాదుల్లో ఒకరైన జెఠ్మలానీ.. 1923 సెప్టెంబరు 14న ముంబయిలో జన్మించారు. ఈయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏడు దశాబ్దాల పాటు ఆయన న్యాయవాద వృత్తిలో కొనసాగారు. ఆయనకు సినీ రంగంతోనూ పరిచయాలున్నాయి.

తెలుగులో ‘రణం’, ‘సామాన్యుడు’, ‘బెండు అప్పారావు’, ‘కత్తి కాంతారావు’, ‘జగద్గురు ఆదిశంకర’ వంటి చిత్రాలలో నటించిన హీరోయిన్ కామ్నా జఠ్మలానీ.. రామ్‌జెఠ్మలానీకి మనుమరాలు.

కామ్నా జఠ్మలానీతండ్రి నిమేష్ జఠ్మలానీ బిజినెస్ మెన్. తల్లి ఫ్యాషన్ డిజైనర్. కామ్నా జఠ్మలానీ 2014లో బెంగుళూరుకు చెందిన పారిశ్రామిక వేత్త సూరజ్ నాగ్పాల్ ను వివాహం చేసుకున్నారు. వివాహామనంతరం ఆమె సినిమాలకు దూరమైంది.