ఒకప్పుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే ఎదో ఒక కంటెంట్ తో సరికొత్త సినిమా అందిస్తాడు అనే ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు కంటెంట్ కంటే కాంట్రవర్సీకి ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు అర్ధమవుతోంది. ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాతో సిద్దమవుతున్న ఆర్జీవీ సినిమా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశాడు. 

ఇప్పటికే సినిమాకు సంబందించిన రెండు పాత్రల పోటోలను రిలీజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ - చంద్రబాబు తరహాలో ఉన్న రెండు పాత్రలకు సంబందించిన స్టిల్స్ ని భయటపెట్టి ఓ వర్గం ఆడియెన్స్ ని ఆకర్షించాడు. ఇక ఇప్పుడు తనదైన శైలిలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని యాడ్ చేయించి సినిమా మోషన్ పోస్టర్ ని వదిలాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది.