యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహోపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు సాహో చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 15న సాహో చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ కమల్ ఆర్ ఖాన్ నిత్యం తన నోటికి పనిచెబుతూ ఉంటాడు. 

హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. గతంలో కమల్ సాహో చిత్రంపై నెగిటివ్ గా స్పందించాడు. 250 కోట్ల భారీ బడ్జెట్ తో సాహో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ కావడం ఖాయం. అతిపెద్ద డిజాస్టర్స్ లో సాహో ఒకటిగా నిలుస్తుంది అంటూ కామెంట్ చేశాడు. 

తాజాగా కమల్ ఆర్ ఖాన్ సాహో చిత్రంపై యూటర్న్ తీసుకున్నాడు. ప్రభాస్ ని ప్రశంసలతో ముంచెత్తడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాహో చిత్రం ఘనవిజయం సాధిస్తుంది. ప్రభాస్ బాలీవుడ్ లో కూడా తిరుగులేని స్టార్ గా అవతరిస్తాడు. సౌత్ నుంచి ఓ హీరో బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదగడం అభినందించదగ్గ విషయం అని కమల్ ప్రశంసించాడు. సాహూ టీజర్ అద్భుతంగా ఉండడంతోనే కమల్ తన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.