కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్-2(తెలుగులో భారతీయుడు-2) మూవీ 1996లో వచ్చిన ఇండియన్(భారతీయుడు) సినిమాకు సీక్వెల్ అనే సంగతి తెలిసిందే.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో భారతీయుడు సీక్వెల్ గా వచ్చిన భారతీయుడు-2 చిత్రం మొన్న (జులై 12) వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అన్ని చోట్ల నుంచి మిక్స్ డ్ టాక్ సంపాదించుకున్న ఈ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ అనుకున్న స్దాయిలో లేదని విమర్శలు, ట్రోలింగ్ జరుగుతోంది. ఇదిలా ఉండగా నెట్ ప్లిక్స్ వారు సోమవారం నుంచి భారతీయుడు సినిమా స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన ఇమేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దాంతో సినిమా రిలీజ్ అయ్యి రెండు రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ ఏమిటి అని ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. అయితే నెట్ ప్లిక్స్ వాడి తెలివి అది. ఇప్పుడు అందరూ భారతీయుడు గురించే మాట్లాడుతున్నారు కదా... ఆ వేడిలో ఉండగానే తమ దగ్గర ఉన్న భారతీయుడు పార్ట్ 1 ని స్ట్రీమింగ్ చేస్తే పోలా అనే ఐడియా వచ్చింది. ఎలాగూ భారతీయుడు 2 బాగోలేదంటున్నారు కాబట్టి ఖచ్చితంగా భారతీయుడు కొంతమందైనా వెతుక్కుని చూస్తారు. వాళ్లని క్యాష్ చేసుకుందామనేది నెట్ ప్లిక్స్ ఐడియా.
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్-2(తెలుగులో భారతీయుడు-2) మూవీ 1996లో వచ్చిన ఇండియన్(భారతీయుడు) సినిమాకు సీక్వెల్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా 4K వెర్షన్ ను జూలై 12న థియేటర్లలో రీ-రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఇండియన్-2 సినిమాను అర్థం చేసుకోవాలంటే తొలుత ఇండియన్ సినిమాను చూడాల్సిందే అని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ అంటోంది. ఆ క్రమంలో విడుదల చేసిన పోస్టర్ అది. కానీ చాలా మంది భారతీయుడు 2 అప్పుడు ఓటిటిలోకి వచ్చేస్తోందేంటని కంగారుపడుతున్నారు. విషయం కాసేపటికి అర్దమవుతోంది.
అదే సమంయలో తొలి రోజు వసూళ్లు కూడా కంగారుపడుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారతీయుడు-2 రూ.12 కోట్లు రాబట్టింది. అటు, అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా రూ.8.34 కోట్లు వసూలు చేసింది. కాగా, ఈ చిత్రం విడుదలకు ముందు భారీగా బిజినెస్ చేసిన నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఇంకా వసూళ్లు పెరిగితేనే చిత్రం బ్రేక్ ఈవెన్ కు వస్తుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి.
రెండున్నర దశాబ్దాల కిందట వచ్చిన భారతీయుడు చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రానికి సీక్వెల్ గా భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై భారతీయుడు-2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చ్రితంలో కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని తదితరులు నటించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.

