కలెక్షన్లు చూసుకున్న శంకర్ టీమ్ వెంటనే నష్ట నివారణ చర్యలతో రంగంలోకి దూకింది. అందులో భాగంగా ఎక్కడ ఈ సినిమా దెబ్బతిందో దానికి ట్రీట్‌మెంట్‌ స్టార్ట్ చేశ

భారతీయుడు 2 సినిమాకు మార్నింగ్ షో నుంచి ప్లాఫ్ టాక్ వచ్చేసింది. దాంతో వీకెండ్ కలెక్షన్స్ లో బాగా డ్రాప్ కనపడింది. ఓపినింగ్స్ అద్బుతం కాకపోయినా ఫరవాలేదనిపించినా శనివారం నాటికే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యి దెబ్బ కొట్టేసింది. కలెక్షన్లు చూసుకున్న శంకర్ టీమ్ వెంటనే నష్ట నివారణ చర్యలతో రంగంలోకి దూకింది. అందులో భాగంగా ఎక్కడ ఈ సినిమా దెబ్బతిందో, జనాలు కామెంట్స్ ,రివ్యూలూ చూసుకున్నారు. ఈ క్రమంలో ఓ కీలకమైన డెసిషన్ తీసుకున్నారు.

ఈ సినిమా లెంగ్త్ ఎక్కువైందని, చాలా ల్యాగ్ గా ఉందని సినిమా చూసిన చాలా మంది కామెంట్ గా తెలిసిందట. అలాగే సినిమాలో అక్కర్లేని సన్నివేశాలు ఉన్నాయని రివ్యూలు వచ్చాయి. అందుకే ఈ సినిమాని ట్రిమ్ చేయాలని దర్శకుడు శంకర్ నిర్ణయించుకున్నాడు. సినిమా విడుదలైన మూడో రోజే కొన్ని యాక్షన్ సీన్లు కట్ చేయాలని దర్శకుడు శంకర్ నిర్ణయించుకుని తన టీమ్ తో ఆ పని చేసారు.

ఈ సినిమాలో అంతటా అక్కడకడ్డాక కట్ చేసుకుంటూ వచ్చి మొత్తానికి 20 నిమిషాలు తగ్గించారు. ముందుగా భారతీయుడు 2 చిత్రం సుమారు 3 గంటల రన్‍టైమ్‍తో వచ్చింది. ఇప్పుడు.. ట్రిమ్ చేశాక 2 గంటల 40 నిమిషాలకు తగ్గి మన ముందుకు రానుంది. అయితే ఈ ట్రిమ్ చేసిన వెర్షన్ ఏ మేరకు జనాలను ఆకట్టుకుంటుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే నెగిటివ్ టాక్ దారుణంగా స్ప్రెడ్ అయ్యింది. 

ఇక ఈ చిత్రం తొలి రోజు వసూళ్లు కూడా కంగారుపడుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారతీయుడు-2 రూ.12 కోట్లు రాబట్టింది. అటు, అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా రూ.8.34 కోట్లు వసూలు చేసింది. కాగా, ఈ చిత్రం విడుదలకు ముందు భారీగా బిజినెస్ చేసిన నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఇంకా వసూళ్లు పెరిగితేనే చిత్రం బ్రేక్ ఈవెన్ కు వస్తుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. 

రెండున్నర దశాబ్దాల కిందట వచ్చిన భారతీయుడు చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రానికి సీక్వెల్ గా భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై భారతీయుడు-2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చ్రితంలో కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని తదితరులు నటించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.