Asianet News TeluguAsianet News Telugu

రిలీజ్‌కు రెడీ అయిన రజనీకాంత్, కమల్‌ హాసన్‌ల `నీ కోసం నిరీక్షణ`

పదినారు వయదినిలే సినిమాను అధునాతన డాల్బీ సౌండ్ పద్ధతుల్లో తెలుగు భాషలోకి అనువదించి, డిజిటలైజ్ చేసి,అన్ని పాటలను మళ్ళీ కొత్తగా పొందుపరచడం జరిగింది. ఈ చిత్రానికి తెలుగులో `నీకోసం నిరీక్షణ` టైటిల్ పెట్టారు. ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టుగా వెల్లడించారు.

Kamal Hassan, Rajinikanth and Sridevi Starrer Is Digitally Restored
Author
Hyderabad, First Published Jun 12, 2020, 5:48 PM IST

భారత చిత్ర పరిశ్రమలో నటదిగ్గజాలు అయినటువంటి మహానటుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్ లతో పాటు అందాల తార శ్రీదేవి నటీనటులుగా భారతీరాజా దర్శకత్వం వహించిన సినిమా `పదినారు వయదినిలే`. ఈ చిత్రం 4 రాష్ట్రీయ పురస్కారాలను సైతం సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా కమల్ హాసన్, ఉత్తమ దర్శకుడిగా భారతీరాజా, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజా, ఉత్తమ నేపథ్య గాయనిగా ఎస్. జానకి జాతీయ పురస్కారాన్ని మరియు ఫిలిం ఫేర్ పురస్కారాన్ని అందుకోవడం విశేషం.

ప్రస్తుతం ఈ చిత్రం అధునాతన డాల్బీ సౌండ్ పద్ధతుల్లో తెలుగు భాషలోకి అనువదించి, డిజిటలైజ్ చేసి,అన్ని పాటలను మళ్ళీ కొత్తగా పొందుపరచడం జరిగింది. ఈ చిత్రానికి తెలుగులో `నీకోసం నిరీక్షణ` టైటిల్ పెట్టారు. ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన అనంత‌రం  మ‌రో అయిదు భాషల్లో డ‌బ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్లు సుప్రీమ్ ఆల్మైటీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత బామా రాజ్ కణ్ణు మాట్లాడుతూ  - `మధురమైన ఈ చిత్రం త‌ప్ప‌కుండా  ప్రేక్షకులను అలరిస్తుందని న‌మ్ముతున్నాను. ఇటీవ‌ల ఆదిత్య‌ మ్యూజిక్ ద్వారా 5 పాట‌ల‌ను విడుదల చేశాం. వాటికి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సుమారు 30 నిముషాల నిడివి దృశ్యాలను తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగ్గ‌ట్లుగా మార్పులు చేసి మీ ముందుకు తీసుకువ‌స్తున్నాం` అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios