‘ఇండియన్ 2’కి షాకింగ్ ఓటిటి ఆఫర్ !
కమల్ రీసెంట్ ఫిల్మ్ ‘విక్రమ్’ అతిపెద్ద సక్సెస్ అవ్వగా.. ఆయన తదుపరి మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘ఇండియన్ 2’. లోక నాయకుడు కమల్ హాసన్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. బ్లాక్ బస్టర్ మూవీ ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా రూపొందిస్తున్నందున మార్కెట్‌లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ క్రమంలో తాజా అప్‌డేట్స్ అభిమానులను థ్రిల్‌కు గురిచేస్తున్నాయి. దర్శకుడు శంకర్ ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో ‘ఇండియన్ 2’ వీఎఫ్ఎక్స్ పనులు పర్యవేక్షిస్తున్నారు. సంబంధిత ఫొటో సైతం నెట్టింట వైరల్ అవుతోంది. అందుకోసం ప్రత్యేకమైన టెక్నాలిజినీ వినియోగిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ ఊపందుకుంది.
కమల్ రీసెంట్ ఫిల్మ్ ‘విక్రమ్’ అతిపెద్ద సక్సెస్ అవ్వగా.. ఆయన తదుపరి మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. దాంతో ఈ చిత్రానికి ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు భారీ మొత్తంలో ఆఫర్ ని ఇచ్చినట్టుగా ఇపుడు ట్రేడ్ లో వినిపిస్తోంది. నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రానికి ఏకంగా 220 కోట్ల ఆఫర్ ని అన్ని భాషల డిజిటల్ హక్కులకు దక్కించుకున్నట్టుగా సమాచారం. నిజమైతే ఇది మాత్రం రికార్డు మొత్తం అని చెప్పాలి. కమల్ ప్రాజెక్టు కే కమిటవ్వటం కూడా ఆయన క్రేజ్ ఒక్కసారిగా నెక్ట్స్ లెవిల్ కు వెళ్లిపోయింది. ఇది గమనించి నెట్ ప్లిక్స్ భారీ ఆఫర్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు.
‘ఇండియన్ 2’ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సిద్ధార్థ్, సముద్రఖని, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ మధ్య ‘ఇండియన్ 3’ రూమర్స్ గురించి నిర్మాతల్లో ఒకరైన ఉదయనిధి స్టాలిన్ ఆసక్తికర విషయం పంచుకున్నారు. ఇందుకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే.