తమిళనాడు రాజకీయాలపై విలక్షణ నటుడు కకమల్ హసన్ ఆసక్తి తానొక రాజకీయ పార్టీ ప్రకటిస్తానని తెలిపిన కమల్ రజినీ కాంత్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధమంటున్న కమల్

జయలలిత మరణం అనంతరం తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితులు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ప్రభుత్వం ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ డీఎంకె కూడా జరగబోయే పరిణామాలను నిషితంగా పరిశీలించి చూస్తోంది. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ దసరా సందర్భంగా పార్టీని ప్రకటిస్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు విలక్షణ నటుడు కమల్ కూడా తన రాజకీయ అరంగేట్రంపై రకరకాల బిహేవియర్ తో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా కమల్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నానని ప్రకటన చేసిన తర్వాత తమిళ పాలిటిక్స్‌ ఒక్కసారిగా వేడెక్కాయి. తమిళనాట నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగానే పాలిటిక్స్‌ లోకి రావాలని నిర్ణయం తీసుకొన్నానని కమల్ ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే. తాను ఏ పార్టీలో చేరనని, సొంతంగా రాజకీయ పార్టీ స్థాపిస్తానని ప్రకటన చేశారు కూడా. అంతేకాకుండా భావస్వారూప్యం ఉన్న పార్టీలతో భాగస్వామ్యమవుతానని చెప్పుకొచ్చారు.

కమల్ హాసన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వస్తున్నందున సినిమాలకు స్వస్తి చెబుతాను. అధికారికంగా ప్రకటన చేయగానే నటనకు గుడ్‌బై చెబుతాను. రాజకీయాలు ప్రస్తుతం ముఖ్యమైనందున కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందే. నా నిర్ణయం చాలా బాధతో కూడుకొన్నది అని కమల్ అన్నారు. కమిట్‌మెంట్స్ ఉన్నందున ప్రస్తుతం ఇంకొన్నాళ్లు సినిమాలు చేస్తుంటాను. కొన్ని కమిట్ మెంట్స్ ఉన్నందున వాటిని నెరవేర్చాల్సి వస్తుంది. సినిమాలు తగ్గించుకుంటూనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తాను అని కమల్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

గతవారం కమల్ హాసన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకొన్నది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రజనీకాంత్ తనకు మంచి స్నేహితుడు. రాజకీయాలపై ఆయనకు సొంత అభిప్రాయం ఉంది. రజనీ ఏ దారిని ఎంచుకొంటారో ఆయన ఇష్టం అని కమల్ అన్నారు. రజనీకి నాకు పోల్చడం సరికాదని అన్నారు.

ప్రస్తుతం కమల్ హాసన్ బిగ్‌బాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. త్వరలోనే ఈ రియాల్టీ షో పూర్తి కానున్నది. అంతేకాకుండా విశ్వరూపం ప్రోస్ట్ ప్రోడక్షన్ పనులపై ఆయన దృష్టిపెట్టాడు. తలైవాన్ ఇరుక్కిరాన్ అనే పొలిటిక్ థ్రిల్లర్‌లో నటించనున్నారు. హిందీలో రిలీజ్ అయ్యే ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ కూడా నటించనున్నారు.