లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విక్రమ్’. ఈ చిత్రం థియేట్రికల్ రన్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.  బాక్సాఫీస్ వద్ద కూడా Vikram కాసుల వర్షం కురిపిస్తోంది. 

యూనివర్సల్ యాక్టర్ కమల్‌ హాసన్‌ (Kamal Haasan) నటించిన తాజా చిత్రం ‘విక్రమ్‌’. ఈ చిత్రం రెండు రోజుల కింద (జూన్3న) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘కార్తీ’, ‘ఖైదీ’ చిత్రాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు లోకేష్‌ కనగరాజు ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తో మరోసారి మ్యాజిక్ చూపించారు. నలుగురి స్టార్స్ ను ఎక్కడా తగ్గకుండా చూపించిన దర్శకుడి బ్రిలియెన్స్ కు థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. ఆడియెన్స్ నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ చిత్రంలో సూరియా (Suriya) నటించిన రోలెక్స్ పాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది. ఫాహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కూడా ఇరగదీశారు. 

కమల్ హాసన్ కూడా సినిమా ఇంతటీ విజయవంతం కావడంతో ఇఫ్పటికే ఆడియెన్స్ కు, అభిమానులకు, చిత్ర యూనిట్ కు, ప్రత్యేకంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్, సూరియాకు ధన్యవాదాలు తెలిపారు. చాలా కాలం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్ హాసన్ కు ‘విక్రమ్’ మంచి ఫలితానివ్వడం ఖుషీ అవుతున్నారు. అయితే ఈచిత్రం అటు బాక్సాఫీస్ వద్ద కూడా తన సత్తా చూపిస్తోంది. రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూల్ చేసింది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సరికి రూ. 200కు పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. మొత్తం రూ.300 కోట్లు సాధించే దిశగా పరుగులు పెడుతోంది.

ప్రస్తుతం ఈ మూవీ రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఎనిమిదో రోజు కూడా వసూళ్లు చేసింది. రూ. 11 కోట్లు వసూల్ చేసినట్టు తెలుస్తోంది. 'విక్రమ్' ఏడు రోజులు పూర్తి చేసుకునే సరికి కమల్ హాసన్ నటించిన ఈ చిత్రం 2022లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా గుర్తింపు పొందింది. బాక్సాఫీస్ వద్ద వారం రోజుల్లో యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే తమిళనాడులో ఈ సినిమా రూ.100 కోట్లు వసూలు చేసిందని వర్గాలు చెబుతున్నాయి. తమిళ స్టార్ విజయ్ నటించిన ‘బీస్ట్’ మూవీ దాదాపు రూ.252 కోట్లు వసూల్ చేసింది. విక్రమ్ బీస్ట్ ను ఇప్పటికే కొన్ని ఓవర్సీస్ లొకేషన్లలో 2022లో ఆల్ టైమ్ హ్యయేస్ట్ గ్రాసింగ్ తమిళ ఫిల్మ్ గా గుర్తింపు పొందింది.