దేవిశ్రీ ప్రసాద్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన లోకనాయకుడు కమల్ హాసన్
దేవిశ్రీకి సర్ ప్రైజింగ్ గిఫ్ట్ అందింది. అది కూడా సర్ ప్రైజింగ్ సెలబ్రిటీ నుంచి. ఈ విషయం చెప్పి తన అభిమానులకు సర్ ప్రైజ్ చేశాడు రాక్ స్టార్. ఇంతకీ ఎంటా సర్ ప్రైజింగ్ గిఫ్ట్.

మ్యూజిక్ కంపోజర్ గా స్టార్ హీరోలను మించిన స్టార్ డమ్ సంపాదించాడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. తెలుగు,తమిళ భాషల్లో ఆయన ప్రభంజంనం అంతా ఇంతా కాదు. కాని ఈమధ్య కాస్త దేవిశ్రీ ప్రసాద్ జోరు తగ్గింది. తమన్ కు ఆఫర్లు పెరిగాయి. అతితే ప్రస్తుతం ఇద్దరు ఈక్వల్ గానే ఆఫర్స్ కొట్టేస్తున్నారు. ఈక్రమంలో తను డౌన్ అయిన ప్రతీ సారి ఏదో ఒక సినిమాతో దడదడలాడిస్తాడు దేవి. దేవి ఆఫర్స్ తగ్గుతున్న టైమ్ లో.. పుష్పతో పాన్ ఇండియానే ఆకర్షించాడు దేవిశ్రీ.
ఇక తనకు సబంధించి విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో శేర్ చేసుకుంటాడు దేవిశ్రీ. నెట్టింట యమా యాక్టీవ్ గా ఉంటాడు దేవిశ్రీ. ఇక తాజాగా ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ ను శేర్ చేశాడుస్టార్ మ్యూజిక్ డైరెక్టర్. తమిళంలో స్టార్ హీరోలతో దేవిశ్రీకి మంచి సాన్నిహిత్యం ఉంది. ఈక్రమంలో తాజాగా లోకనాకకుడు కమల్ హాసన్ .. మన దేవి శ్రీకి ఓ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈ విషయాన్ని దేవి నే తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.
పోస్ట్ లో దేవిశ్రీ ఈ విధంగా రాసుకొచ్చాడు. 2022 నుంచి మరో మంచి మెమొరీ దక్కింది. అమెరికా నుండి మన లోకనాయకుడు కమల్ హాసన్ సర్ నాకు ఈ గిఫ్ట్‌ను పట్టుకొచ్చారు. నా మీద ఆయనకు ఉన్న ప్రేమ అలాంటిది. అందుకే ఆయన ఈ గిఫ్ట్ ను తీసుకొచ్చారు అంటూ దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు. ఇంతకీ ఆ సర్ ప్రైజింగ్ గిఫ్ట్ ఏంటీ అంటే.. హ్యాండ్ మేడ్ బుక్. చేతితో తయారు చేసిన పుస్తకాన్ని కమల్ దేవిశ్రీ కోసం తీసుకోచ్చాడు. అయితే అందులో ఏమున్నాయంటే.. మ్యూజిక్ నోట్స్.. ఉన్నాయి. అతే కాదు కవర్ మీద కమల్ హాసన్ మాటలు, సంతకం ఉన్నాయి. ‘నా బిడ్డ.. ఇది మీ అడ్డా..’ అంటూ పుష్ప సినిమాలోని సాంగ్ డైలాగ్ రాసుంది అందులో.
ఇక దేవిశ్రీ పోస్ట్ లో రాస్తూ.. నేనెంత అదృష్టవంతుడిని.. నా మీద ప్రేమ, నమ్మకాన్ని చూపిస్తున్నందుకు థాంక్యూ సర్.. కమల్ సార్ కొత్త కారులోనే నేను ఇలా ఆయనతో పాటుగా ఫోటో దిగాను.. అందులో అదిరిపోయే సౌండ్ సిస్టమ్ ఉందంటూ.. దేవి శ్రీ ప్రసాద్ ఓ ఫోటో శేర్ చేయడంతో పాటు.. ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.