లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన `విక్రమ్` చిత్రం అరుదైన ఘనత సాధించబోతుంది. ఈ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబోతుంది.
యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న చిత్రం `విక్రమ్`. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తనసొంత బ్యానర్ అయిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ పతాకంపై కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
తాజాగా ఈ సినిమా ఓ అరుదైన మైల్ స్టోన్‌ని చేరుకోబోతుంది. అరుదైన ఘనతని సాధించబోతుంది. ఈ చిత్ర ట్రైలర్‌ని 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విడుదల చేయబోతున్నారు. మే 18న కేన్స్ లో ఈ `విక్రమ్` చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. అయితే కేన్స్ లో ట్రైలర్ విడుదల చేయబోతున్న తొలి ఇండియా చిత్రంగా `విక్రమ్` చరిత్ర సృష్టించబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కమల్ సరికొత్త సంచలనాలకు తెరలేపారు. సినిమాని వరల్డ్ ఆడియెన్స్ కి రీచ్ చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్టు చిత్ర యూనిట్ పేర్కొంది.
``విక్రమ్` ఎన్‌ఎఫ్‌టీ, చిత్ర ట్రైలర్‌లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో లాంచ్ చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. విస్టావర్స్, లోటస్ మెటా ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు` రాజ్‌కమల్ ఫిల్మ్ ప్రకటించింది. అంతేకాదు సినిమాని దేశ వ్యాప్తంగా ప్రమోట్ చేయబోతున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో దీన్ని రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పోలీస్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం సాగుతుందని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకుంది.
75వ కేన్ ఫిల్మ్ ఫెస్టివల్ పారిస్‌లో జరగబోతుంది. మే 17 న ప్రారంభమయ్యే ఈ చిత్రోత్సవ వేడుక మే 28 వరకు 12 రోజులపాటు సాగుతుంది. ప్రపంచంలోని ఎంపిక చేయబడ్డ చిత్రాలు ఇందులో ప్రదర్శించబడతాయి. సినిమా కల్చర్‌ని విస్తరించడం, సినిమా రంగంలో వస్తున్న మార్పులను తెలిసేలా చేయడం, టాలెంట్‌ని వెలికితీయడం వంటి అంశాలతో ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తారు. ఇందులో ఉత్తమ చిత్రానికి `పాల్మ డి ఓర్`(గోల్డెన్ పామ్) అవార్డుని అందిస్తారు.
