తమిళనాడు ఎన్నికలు రావడం, కమల్‌ పోటీ చేయడం, మరోవైపు కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆగిపోయిన `విక్రమ్‌` సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభించారు. శుక్రవారం నుంచి చిత్ర షూటింగ్‌ని ప్రారంభించిన్నట్టు యూనిట్‌ తెలిపింది.

కమల్‌ హాసన్‌ నటిస్తున్న మరో విభిన్న చిత్రం `విక్రమ్`. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్‌ సొంత బ్యానర్‌ అయిన రాజ్‌కమల్‌ ఫిల్మ్ నిర్మిస్తుంది. ఈ సినిమా ఇప్పటికే ప్రారంభమై కొంత పార్ట్ షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. ఈ లోపు తమిళనాడు ఎన్నికలు రావడం, కమల్‌ పోటీ చేయడం, మరోవైపు కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది. 

ఇప్పుడు తిరిగి షూటింగ్‌ని ప్రారంభించారు. శుక్రవారం నుంచి చిత్ర షూటింగ్‌ని ప్రారంభించిన్నట్టు యూనిట్‌ తెలిపింది. చెన్నైలోనే కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట యూనిట్‌. ఇందులో కమల్‌తోపాటు విజయ్‌ సేతుపతి కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. 

కమల్‌ నుంచి వస్తోన్న మరో డిఫరెంట్‌ చిత్రమని అర్థమవుతుంది. దీన్ని పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌. తాజాగా ప్రారంభమైన నయా చిత్రీకరణ సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమాకి మొదటగా సత్యన్‌ సూర్యన్‌ కెమెరామెన్‌గా పనిచేశారు. ఆయనకు ఇతర సినిమాలతో `విక్రమ్‌` షూటింగ్‌ డేట్స్ క్లాష్‌ కావడంతో ఆయన స్థానంలో గిరీష్‌ గంగాధరన్‌ని ఎంపిక చేశారు. 

Scroll to load tweet…