`విక్రమ్‌` చిత్రం నుంచి ఫస్ట్ గ్లాన్స్ విడుదల చేశారు. ఇందులో కమల్‌ హాసన్‌ ఎంట్రీ అదిరిపోయేలా ఉంది. గూస్‌బమ్స్ తెప్పిస్తుంది. 48 సెకన్ల నిడివి గల వీడియో ఇప్పుడు దుమ్మురేపుతుంది. యూట్యూబ్‌లో దుమారం సృష్టిస్తుంది.

కమల్‌ హాసన్‌(Kamal Haasan) బర్త్ డే కానుక వచ్చింది. అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చాడు యూనివర్సల్‌ యాక్టర్‌. తాను నటిస్తున్న `విక్రమ్‌`(Vikram Movie) చిత్రం నుంచి ఫస్ట్ గ్లాన్స్ విడుదల చేశారు. ఇందులో Kamal Haasan ఎంట్రీ అదిరిపోయేలా ఉంది. గూస్‌బమ్స్ తెప్పిస్తుంది. 48 సెకన్ల నిడివి గల వీడియో ఇప్పుడు దుమ్మురేపుతుంది. యూట్యూబ్‌లో దుమారం సృష్టిస్తుంది. ఓ జైల్లో నుంచి తప్పించుకుంటున్న క్రమంలో పోలీసులు వెంటపడుతుంటారు. కాల్పులు జరుపుతుంటారు. పోలీస్‌ రక్షణ కవచాలను అడ్డుపెట్టుకుని ఒక్కసారిగా ఓపెన్‌ చేసి తనదైన యాక్షన్‌ లుక్‌తో కమల్‌ ఎంట్రీ అదిరిపోయేలా ఉంది. గూస్‌బమ్స్ తెప్పిస్తుంది. 

YouTube video player

ప్రస్తుతం ఈ `విక్రమ్‌` ఫస్ట్ గ్లాన్స్ వైరల్ అవుతుంది. అభిమానులను అలరిస్తుంది. కమల్‌ బర్త్ డేకి మంచి ట్రీట్‌గా భావిస్తున్నారు. ఇక లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌ హీరోగా నటిస్తుండగా, విజయ్‌ సేతుపతి, మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. Vikram సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో Kamal Haasan లుక్‌ ఆద్యంతం కట్టిపడేస్తుంది. మాసిన గెడ్డంతో ఆయన అదరగొడుతున్నారు. కమల్‌, ఫాహద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతిలతో కలిపి రిలీజ్‌ చేసిన పోస్టర్‌ అదరగొట్టింది. మరోవైపు ఫస్ట్ గ్లింప్స్ మైండ్‌ బ్లోయింగ్గా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా కమల్‌ పుట్టిన రోజు కానుకగా విడుదల చేసిన ఫస్ట్ గ్లాన్స్ సైతం సినిమాపై అంచనాలను పెంచుతుంది. 

అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. కమల్‌ హాసన్‌ ఆరు దశాబ్దాలుగా ఆయన నటుడిగా రాణిస్తున్నారు. నాలుగు జాతీయ అవార్డులు, పద్మ శ్రీ, పద్మ భూషణ్‌ పురస్కారాలను సొంతం చేసుకున్నారు. అనేక అంతర్జాతీయ అవార్డులు ఆయన్ని వరించాయి. నటనకు కేరాఫ్‌గా నిలిచే కమల్‌ యూనివర్సల్‌ నటుడిగా పేరుతెచ్చుకున్నారు. ఇండియన్‌ సినిమాకి ఓ గర్వకారణంగా నిలిచారు.

ఆరు దశాబ్దాల కెరీర్‌లో 220కిపైగా చిత్రాల్లో నటించారు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, సింగర్‌గా, స్క్రీన్‌రైటర్‌గా, పాటల రచయితగా, టెలివిజన్‌ హోస్ట్ గా రాణిస్తుంది. ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. కమల్‌ చివరగా కమల్‌ మూడేళ్ల క్రితం `విశ్వరూపం2`లో కనిపించిన విషయం తెలిసిందే. ఆయన తర్వాత ఆయన భారతీయుడు సినిమాని ప్రారంభించారు. కానీ ఇది అనేక ప్రమాదాలు, అవాంతరాల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో `విక్రమ్‌`ని శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాతో ఆయన పూర్వ వైభవాన్ని పొందాలని భావిస్తున్నారు. కమల్‌ అభిమానులు కూడా `విక్రమ్‌` సినిమా కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

also read: ఫుల్ కామెడీ: సత్యదేవ్ “స్కై ల్యాబ్” ట్రైలర్!