ఒక్క హిట్టుతో.. జోరు పెంచాడు కమల్ హాసన్. నాన్ స్టాప్ గా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఇటు సినిమాలు.. అటు పాలిటిక్స్ రెండింటిని బ్యాలన్స్ చేస్తున్న కమల్.. నెక్ట్స్ సినిమాను రెండింటికి ఉపయోగపడేలాప్లాన్ చేస్తున్నాడట.
చాలా కాలం స్థబ్ద్ గా ఉన్న కమల్ హాసన్ ఫిల్మ్ కెరీర్ లో విక్రమ్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. ఈసినిమా తిరుగులేని కంబ్యాక్ ఇచ్చిన కమల్ అదే జోష్‌తో.. వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నారు. కమల్ హాసన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ.. ఆయన ఫిల్మ్ ..కెరీర్ తో పాటు పొలిటికల్ కరెరీర్ కూడా ఊపయోగపడేవే. ముఖ్యంగా కమల్ చేస్తున్న ఇండియన్-2 సినిమాపై.. దేశ వ్యాప్తంగా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. కమల్ ఫ్యాన్స్ తో పాటు.. కామన్ ఆడియన్స్ కూడా ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సమ్మర్‌లో రిలీజ్‌కు ముస్తాబుతోంది. ఈక్రమంలో కమల్ హాసన్ ఇదే ఊపులో మరో రెండు మూడు సినిమాలకు సైన్ చేశాడు. అందులో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ సినిమా ప్రాజెక్ట్ కే కూడా ఉంది. ఈమూవీ కోసం కమల్ దాదాపు 150 కోట్ల రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నాడట. ప్రాజెక్ట్ కేలో కమల్ విలన్ గా నటించబోతున్నట్టు సమాచారం.
ఇక ఈసినిమాలు పక్కన పెడితే.. కమల్ మణిరత్నంతో మరో సినిమా చేయబోతున్నాడు. ఈసినిమా చాలా స్పెషల్ గా ఉండబోతున్నట్టు తెలుస్తొంది. దాదాపు 36 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్‌లో సినిమా రానుండటంతో అందరిలోనూ తిరుగులేని ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈసినిమా.. లో శింబు కూడా ఇంపార్టెంట్ రోలో చేయబోతున్నట్టు సమాచారం.
ఇకమణిరత్నం సినిమాతో పాటు.. హెచ్ వినోద్ డైరెక్షన్ లో కమల్ మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈక్రమంలో ఈ సినిమా కథ రైతుల సమస్యలపై ఉండబోతోందట. ఈసినిమాను కమల్ ప్రత్యేకంగా ప్లాన్ చేశారని సమాచారం. వచ్చే ఏడాదిషూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. ఈసినిమాతో కమల్ కు కూడా కాస్త పొలిటికల్ మైలేజ్ పెరిగేలా ప్లాన్ చేసినట్టు సమాచారం.
