ఇండిపెండెన్స్ డే సందర్భంగా అదరిపోయే అప్ డేట్ ఇచ్చాడు శంకర్. ఫ్యాన్స్ కోసం కమల్ హాసన్ లుక్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.
చరణ్ సినిమాకు గ్యాప్ రావడంతో.. సూపర్ ఫాస్ట్ గా ఇండియన్ 2 మూవీ షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు డైరెక్ట్ శంకర్. ఈమూవీ షూటింగ్ ఆల్ మోస్ట్ అయిపోయినట్టే అంటున్నారు. చిన్న చిన్న ప్యాచ్ వర్కులు తప్పించి దాదాపు 90 శాతం షూటింగ్ అయిపోయినట్టే తెలుస్తోంది. ఈక్రమంలో ఈమూవీ నుంచి ఇక వరుస అప్ డేట్స్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈమూవీపై హైప్ పెంచేందుకు అదరిపోయే ప్లాన్లు వేస్తున్నారు మేకర్స్ అందులో భాగంగా తాజాగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా కమల్ హాసన్ కు సబంధించిన న్యూ లుక్ పోస్టర్ వదిలారు మూవీ టీమ్.
కాగా మంగళవారం(అగస్ట్ 15) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి కమల్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఖాకీ చొక్కా వేసుకుని నిల్చున్న కమల్ లుక్ అదిరిపోయింది. ఇక ఈ సినిమా కోసం శంకర్ బాగానే కసరత్తులు చేస్తున్నట్లు ఇన్‌సైడ్ టాక్. మొదటగా ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నా.. షూటింగ్ ప్యాచ్ వర్కులు,. ఆతరువాత పోస్ట్ ప్రొడక్షన్ హడావిడి పడకుండా.. నిదానంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.
అందుకే ఇండియన్ 2 మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడే చాన్స్ ఉంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే నెవర్ బిఫోర్ అనే రేంజ్‌లో ఫైట్స్ డిజైన్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న నటిస్తున్న ఈ సినిమాను రెడ్ జియాంట్, లైకా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ప్రస్తుతం కమల్ హాసన్ ఓల్డ్ మెన్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి శంకర్ ఈసారి ఎలాంటి సినిమా అందిస్తాడో చూడాలి. 30 ఏళ్ళ క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈమూవీ తెరకెక్కుతోంది. అయితే ఈసినిమా అంతకు మించి ఉంటుందని సమాచారం.
