తమిళ సీనియర్ డైరెక్టర్ మణిరత్నం ట్రీమ్ ప్రాజెక్ట్ రిలీజ్ కు రెడీ అవుతుంది. వచ్చేనెల ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతున్న ఈమూవీ ముందస్తు వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.
తమిళ దర్శకుడు మణిరత్నం ఎన్నో ఏళ్ళుగా కలలు కంటున్న డ్రీమ్ ప్రాజెక్ట్.. పొన్నియన్ సెల్వన్. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించింది. తమిళుళ చరిత్రకు సబందించిన కథతో..తెరకెక్కుతున్న ఈసినిమా... తమిళనాట సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దాంతో సెకండ్ పార్ట్ ను అతకు మించి రూపోందించాలని పట్టుదలతో పనిచేశారు మణిరత్నం. తమిళనాట ఇప్పటి వరకూ వచ్చిన భారీ బడ్జెట్ సినిమాల్లో పొన్నియిన్ సెల్వన్ కూడా ఒకటిగా నిలిచింది. మణిరత్నం దర్శకత్వం వహించడమే కాదు .. లైకా ప్రొడక్షన్స్ వారితో కలిసి ఈ సినిమాను నిర్మించారు.
చోళ - పాండ్యరాజుల మధ్య సాగే యుద్దాలే, కుట్రలు కుతంత్రాల కథలను బేస్ చేసుకుని ఈసినిమాను తెరకెక్కించారు. ఇక సెకండ్ పార్ట్ ఆఫ్ పొన్నియన్ సెల్వన్ కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈనెల 28న ప్రంపంచ వ్యాప్తంగా థియేటర్లున పలకరించబోతోంది. దాంతో ప్రమోషన్లకు పదును పెడుతున్నారు టీమ్. ఇందులో భాగంగానే పొన్నియన్ సెల్వన్ ఆడియో రిలీజ్ తో పాటు...ట్రైలర్ లాంచ్ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు టీమ్. ఈ ఈవెంట్ కు తమిళ సినీ పరిశ్రమ మొత్తం తరలి రాబోతున్నట్టు తెలుస్తోంది.
చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ..ఈ మూవీ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు టీమ్. ఈవెంటుకి లోకనాయకుడు.. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ముఖ్య అతిధిగా రాబోతున్నారు. 29న సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. సినిమా రిలీజ్ కు ఇంకా నెల మాత్రమే టైమ్ ఉండటంతో ప్రమోషన్లలో జోరు పెంచబోతున్నారు టీమ్. ఈక్రమంలోనే రీసెంట్ గా ఏఆర్ రెహ్మాన్ తన మ్యూజిక్ సిట్టింగ్స్ కు సబంధించినఓ వీడియోను తన ట్విట్టర్ లో పంచుకున్నారు. 29న ఈవెంట్ జరగబోతుందని అఫీషియలం గా ట్వీట్ చేశారు రెహమాన్.
ఇక పొన్నియిన్ సెల్వన్ సినిమాలలో మొదటి భాగం లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి.. తన సత్తా చాటుకుంది. భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈసినిమా తమిళ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించి తమిళనాట కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇతర భాషల్లో కూడా పర్వాలేదు అనిపించుకుంది మూవీ. ఇక ఈమూవీకీ సీక్వెల్ గా రూపొందుతున్న పొన్నియిన్ సెల్వన్ 2 కూడా రిలీజ్ కు రెడీ అయ్యింది. వచ్చే నెల అంటే ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా.
పోన్నియన్ సెల్వన్ సినిమాలతో.. తమిళ పరిశ్రమ ఖాతిని చాటి చెప్పాలి అని చూస్తున్నారు మేకర్స్. అటు ఈసినిమా వల్ల.. ఫెయిడ్ అవుట్ అవుతుంది అనుకున్న సీనియర్ హీరోయిన్ త్రిషకు మళ్లీ హీరోయిన్ గా ఛాన్స్ లు వస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇక పొన్నియన్ సెల్వన్ మూవీ కోసం.. తమిళ ఇండస్ట్రీ అంతా ఒక్క తాటిమీదకు వచ్చింది
