తన కూతురు శృతి హాసన్‌ ప్రియుడికి తండ్రి కమల్‌ హాసన్‌ థ్యాంక్స్ చెప్పాడు. తమ పోరాటాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. మరి కూతురి ప్రేమించిన వాడికి కమల్‌ ఎందుకు థ్యాంక్స్ చెప్పాడనేదే ఇక్కడ మిలియన్‌ డాలర్ల ప్రశ్న. దానికి ఆసక్తికరమైన స్టోరీనే ఉంది.

తన కూతురు శృతి హాసన్‌ ప్రియుడికి తండ్రి కమల్‌ హాసన్‌ థ్యాంక్స్ చెప్పాడు. తమ పోరాటాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. మరి కూతురి ప్రేమించిన వాడికి కమల్‌ ఎందుకు థ్యాంక్స్ చెప్పాడనేదే ఇక్కడ మిలియన్‌ డాలర్ల ప్రశ్న. దానికి ఆసక్తికరమైన స్టోరీనే ఉంది. ఇటీవల 35వ పుట్టిన రోజు జరుపుకున్న శృతి హాసన్‌ ఈ సందర్భంగా తన ప్రియుడిని పరిచయంచేసింది. డూడుల్‌ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ఆమె ప్రేమలో ఉన్నట్టు చెప్పకనే చెప్పేసింది. అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను పంచుకుంది. 

ప్రియుడు డూడుల్‌ ఆర్టిస్టు కావడంతో శృతి ఫాదర్‌, కమల్‌ని ఇంప్రెస్‌ చేసే ప్రోగ్రామ్‌ పెట్టుకున్నాడు. ఆయన వద్ద మార్కులు కొట్టేయాలని ప్లాన్‌ చేశాడు. కమల్‌ పార్టీని ప్రతిబింబించేలా, ఆయన రాజకీయాల్లో చేస్తున్న సేవ వంటి వాటి, వచ్చే నెలలో జరగబోయే ఎన్నికలకు కమల్‌ అన్ని రకాలుగా సిద్దమవుతున్నట్టు డూడుల్‌ పెయింటింగ్‌ ఆర్ట్‌ ని గీసి కమల్‌కి బహుమతిగా ఇచ్చాడు శాంతను. దీనికి ఆనందించిన కమల్‌.. శాంతనుకి ధన్యవాదాలు తెలిపారు. ఇన్‌స్టాలో అతను పంపిన ఆర్ట్ ని పోస్ట చేస్తూ తమ పోరాటాన్నిగుర్తించినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నాడు. 

View post on Instagram

మొత్తానికి శృతి లవర్‌ తండ్రి వద్ద మంచి మార్కులే కొట్టేశాడని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇతర పార్టీలను కలుపుకుని కమల్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. మూడు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నాడు. ఏడు నంచి అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే కమల్‌ నటిస్తున్న `ఇండియన్‌ 2` ఆగిపోయింది. ప్రస్తుతం `విక్రమ్‌` చిత్రంలో నటిస్తున్నారు. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించారు.