ఏజ్ బార్ అవుతున్నా.. ఎక్కడా తగ్గడంలేదు లోకనాయకుడు కమల్ హాసన్.. రెమ్యూనరేషన్ విషయంలో మేకర్స్ కు షాక్ ఇస్తున్నాడు స్టార్ సీనియర్ హీరో. ఇంతకీ అసలు సంగతేంటంటే..?
లోకనాయకుడు కమల్ హాసన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలో మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కమల్ హాసన్ క్రేజ్ గురించి తెలిసిందే..? ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కేలో ప్రముఖ నటుడు కమలహాసన్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ రీసెంట్ గా అఫీషయల్ గా కన్ ఫార్మ్ చేశారు. దాంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
అయితే అదంతా ఒక ఎత్తయితే.. తాజాగా అదే క్రమంలో కమల్ హాసన్ రెమ్యూనరేషన్ పై ప్రస్తుతం భారీ చర్చ స్టార్ట్అయ్యింది. ప్రాజెక్ట్ కే కోసం 150 కోట్లకు పైగా పారితోషికం ఇవ్వడానికి.. ప్రాజెక్ట్ కే నిర్మాతలు రెడీ అయినట్టు తెలుస్తోంది. కొంత మంది మాత్రం ఈసినిమాకోసం కమల్ దాదాపు 100 కోట్లు పారితోషికం తీసుకోబోతున్నట్టు చెపుతున్నారు. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇది ఇలా ఏంటే.. కమల్ హాసన్ బిగ్ బాస్ హోస్ట్ గా తీసుకునే రెమ్యూనరేషన్ కూడా హాట్ టాపిక్ అయ్యింది.
ఇదిలా ఉంటే, కమల్ హోస్ట్‌గా తమిళ బిగ్‌బాస్ షో ఏడవ సీజన్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. తాను హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్టు కమల్ హాసన్ కూడా రీసెంట్ గానే కన్ ఫార్మ్ చేశాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. నేను తమిళ బిగ్ బాస్‌లో పాల్గొంటున్నా. ప్రజలతో కమ్యూనికేట్ చేసేందుకు ఇది మంచి వేదిక అని కమల్ హాసన్ అన్నారు. అయితే ఆగస్టు నెలలో ఈ షో స్టార్ట్ కాబోతోంది. ఇప్పుడు అతి పెద్ద చర్చ ఏంటంటే.. ఈ సీజన్ కోసం కమల్ హాసన్ ఏకంగా 130 కోట్లు తీసుకుంటున్నారట. చెన్నై ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఈ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా.. ఎప్పుడో 27 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోంది. ఈమూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు చివరి దశలో ఉంది. దీని తరువాత వరుస ప్రాజెక్ట్స్ తో కమల్ బిజీ కాబోతున్నారు. ఆయన ఖాతాలో మణిరత్నం సినిమా కూడా ఉంది. మరి ఇవన్నీ కమల్ హాసన్ ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.
